Page Loader
SRH vs RCB: ఆర్సిబి కి షాక్ .. 42 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్ గెలుపు 
ఆర్సిబి కి షాక్ .. 42 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్ గెలుపు

SRH vs RCB: ఆర్సిబి కి షాక్ .. 42 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్ గెలుపు 

వ్రాసిన వారు Sirish Praharaju
May 23, 2025
11:52 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్ 2025 సీజన్‌లో సన్‌ రైజర్స్ హైదరాబాద్ తన విజయ యాత్రను కొనసాగించింది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానం లక్ష్యంగా పెట్టుకున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ఈ మ్యాచ్ తీవ్ర నిరాశను మిగిల్చింది. లఖ్‌నవూలో జరిగిన ఉత్కంఠ భరితమైన పోరులో హైదరాబాద్ జట్టు 42 పరుగుల తేడాతో విజయాన్ని ఖాయం చేసుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఎస్‌ఆర్‌హెచ్, తమ ఇన్నింగ్స్‌లో 231 పరుగులకు ఆరు వికెట్లను కోల్పోయింది.

వివరాలు 

ఆర్సీబీకి కేవలం ఒకే ఒక మ్యాచ్ మిగిలి ఉంది

అనంతరం భారీ లక్ష్యాన్ని చేధించేందుకు దిగిన బెంగళూరు జట్టు 189 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ ఓటమితో ఆర్సీబీ పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి చేరగా, పంజాబ్ కింగ్స్ రెండో స్థానాన్ని దక్కించుకుంది. పాయింట్ల పరంగా పంజాబ్, బెంగళూరు జట్లు రెండూ సమానంగా 17 పాయింట్లు సాధించినప్పటికీ, నెట్‌రన్‌రేట్ విషయంలో మాత్రం పంజాబ్ (+0.389) స్పష్టమైన ఆధిక్యంలో ఉంది. బెంగళూరుకు నెట్‌రన్‌రేట్ (+0.255) పంజాబ్ కంటే తక్కువగా ఉంది. పంజాబ్ జట్టు ఇంకా రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉండగా, ఆర్సీబీకి కేవలం ఒకే ఒక మ్యాచ్ మిగిలి ఉంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

 సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఘన విజయం