IPL Retention: రిటెన్షన్‌లో సన్ రైజర్స్ సంచలనం.. క్లాసెన్‌కు రూ. 23 కోట్లు,మిగతా ప్లేయర్లకు భారీ ఆఫర్లు!
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో హెన్రిచ్ క్లాసెన్‌ను అట్టిపెట్టుకోవడానికి ఏకంగా రూ. 23 కోట్ల భారీ మొత్తాన్నిసన్‌రైజర్స్ హైదరాబాద్ ఖర్చు చేసింది. క్లాసెన్ గత సీజన్‌లో చెలరేగిపోవడంతో ఈసారి రిటెన్షన్ జాబితాలో అతడిని పెద్ద ధర పెట్టుకుని నిలిపింది. టీమ్ మేనేజ్‌మెంట్ పటిష్ఠమైన జట్టును కూర్చేందుకు పాట్ కమిన్స్, ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డిలను కూడా రిటైన్ చేసుకోవడం విశేషం. క్లాసెన్‌కు రికార్డు స్థాయి రూ. 23 కోట్లు చెల్లించగా, ప్యాట్ కమిన్స్‌కు రూ. 18 కోట్లు, ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మలకు ఒక్కొక్కరికి రూ. 14 కోట్లు ఇచ్చేందుకు సన్‌రైజర్స్ సిద్ధమైంది.
సంజు శాంసన్ కు రూ.18 కోట్లు
ఇక ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డికి రూ. 6 కోట్లను ఆఫర్ చేసింది. ఇలాంటి భారీ బడ్జెట్‌తో ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ తమ జట్టును మరింత బలోపేతం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. మాజీ చాంపియన్స్ రాజస్థాన్ రాయల్స్ కూడా రిటెన్షన్‌లో చురుగ్గా వ్యవహరించింది. తమ కెప్టెన్ సంజూ శాంసన్, యశస్వీ జైస్వాల్‌లకు రూ. 18 కోట్లు చెల్లించేందుకు రాజస్థాన్ అంగీకరించింది.