Page Loader
SRH vs GT: సన్‌రైజర్స్‌కు వరుసగా నాలుగో పరాజయం.. గుజరాత్ చేతిలో 7 వికెట్ల తేడాతో ఓటమి
సన్‌రైజర్స్‌కు వరుసగా నాలుగో పరాజయం.. గుజరాత్ చేతిలో 7 వికెట్ల తేడాతో ఓటమి

SRH vs GT: సన్‌రైజర్స్‌కు వరుసగా నాలుగో పరాజయం.. గుజరాత్ చేతిలో 7 వికెట్ల తేడాతో ఓటమి

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 06, 2025
11:05 pm

ఈ వార్తాకథనం ఏంటి

సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ వరుస పరాజయాల బాటలో కొనసాగుతోంది. సొంతగడ్డపై జరిగిన మ్యాచ్‌లో గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగిన పోరులో సన్‌రైజర్స్‌ 7 వికెట్ల తేడాతో ఓటమి చవిచూసింది. ఇది సన్‌రైజర్స్‌కు ఐపీఎల్ 2025 సీజన్‌లో వరుసగా నాలుగో ఓటమిగా నమోదైంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. లక్ష్య చేధనలో గుజరాత్ ఆకట్టుకుంది. 16.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 153 పరుగులు చేసింది. ఓపెనర్ శుభ్‌మన్‌ గిల్‌ 61 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు

Details

కీలక ఇన్నింగ్స్ ఆడిన వాషింగ్టన్ సుందర్

, కాగా వాషింగ్టన్‌ సుందర్‌ 49 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. హైదరాబాద్‌ బౌలర్లలో మహ్మద్‌ షమీ రెండు వికెట్లు తీసినా, మ్యాచ్‌పై ప్రభావం చూపలేకపోయాడు. పాట్ కమిన్స్‌ ఒక వికెట్‌ తీసాడు. అయితే గుజరాత్‌ బ్యాటర్లపై ఒత్తిడి సృష్టించడంలో సన్‌రైజర్స్‌ బౌలింగ్ విఫలమైంది.

Details

నాలుగు వికెట్లు పడగొట్టిన సిరాజ్

అంతకు ముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. నితీశ్‌ కుమార్ రెడ్డి 31 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. క్లాసెన్‌ 27 పరుగులు చేశాడు, కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్ 22 నాటౌట్‌గా నిలిచాడు. అభిషేక్‌ శర్మ 18, అనికేత్‌ వర్మ 18, ఇషాన్‌ కిషన్ 17 పరుగులతో మరోసారి నిరాశపరిచారు. గుజరాత్‌ టైటాన్స్‌ బౌలర్లలో సిరాజ్‌ కీలక పాత్ర పోషించారు. నాలుగు వికెట్లు తీసి సన్ రైజర్స్ బ్యాటర్ల నడ్డి విరిచాడు. ప్రసిద్ధ్‌ కృష్ణ రెండు వికెట్లు తీసి మిడిల ఆర్డర్‌ను దెబ్బతీశారు. ఇక సాయి కిశోర్‌ రెండు వికెట్లు తీసి ఫర్వాలేదనిపించాడు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఏడు వికెట్ల తేడాతో సన్ రైజర్స్ గెలుపు