
KL Rahul : టీమిండియా అభిమానులకు సూపర్ న్యూస్.. ప్రాక్టీస్ మొదలెట్టిన కేఎల్ రాహుల్
ఈ వార్తాకథనం ఏంటి
భారత్ క్రికెట్ జట్టుకు గుడ్ న్యూస్ అందింది. కొంతకాలంగా గాయం కారణంగా జట్టుకు దూరమైన టీమిండియా బ్యాటర్ కేఎల్ రాహుల్ వేగంగా కోలుకుంటున్నాడు.
ప్రస్తుతం అతను మైదానంలో ప్రాక్టీస్ మొదలు పెట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
2023 మార్చి నెలలో భారత్ తరుపున కేఎల్ రాహుల్ చివరి మ్యాచ్ ఆడిన విషయం తెలిసిందే. గాయం కారణంగా మళ్లీ జట్టులో స్థానంలో సంపాదించలేదు.
కేఎల్ రాహుల్ తో పాటు జస్ప్రిత్ బుమ్రా, శ్రేయస్ అయ్యర్ గాయం కారణంగా జట్టుకు దూరమైన విషయం తెలిసిందే.
Details
2017లో ఆస్ట్రేలియా తరుపున చివరి టెస్టు ఆడిన కేఎల్ రాహుల్
ఐపీఎల్ 2023లో గాయపడిన కేఎల్ రాహుల్ గాయపడి జాతీయ జట్టుకు దూరమయ్యాడు. ప్రస్తుతం అతను బ్యాట్ పట్టుకొని ప్రాక్టీస్ చేస్తుండటంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇటీవల జాతీయ జట్టుకు దూరమైన బుమ్రా, మళ్లీ ఐర్లాండ్ సిరీస్ కోసం జట్టులో స్థానం సంపాదించాడు.
కేఎల్ రాహుల్ టీమిండియా తరుపున 2017 ఫిబ్రవరిలో ఆస్ట్రేలియాతో చివరి టెస్టు మ్యాచ్ ఆడిన విషయం తెలిసిందే. ఇప్పటివరకూ 54 వన్డేల్లో 1986 పరుగులు చేశాడు. ఇందులో 5 సెంచరీలు, 13 హాఫ్ సెంచరీలను బాదాడు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ప్రాక్టీస్ మొదలు పెట్టిన కేఎల్ రాహుల్
Wicketkeeper KL Rahul is back. 🤩
— Kunal Yadav (@kunaalyaadav) August 2, 2023
He's almost ready for comeback! ❤️🔥 pic.twitter.com/2sHawF0BdL