Virat Kohli: 'సూపర్ స్టార్ సంస్కృతి' ని వదిలేయాలి.. కోహ్లీపై ఇర్ఫాన్ పఠాన్ విమర్శలు
ఈ వార్తాకథనం ఏంటి
భారత క్రికెట్ జట్టులో సూపర్ స్టార్ సంస్కృతి వద్దు అని, విరాట్ కోహ్లీపై మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ తీవ్ర విమర్శలు గుప్పించారు.
కోహ్లీని పక్కన పెట్టి యువ ఆటగాడిని జట్టులోకి తీసుకోవాలని పఠాన్ అభిప్రాయపడినట్లు తెలిపారు.
బోర్డర్-గావస్కర్ ట్రోఫీ సిరీస్‌లో భారత జట్టు ఓటమి తర్వాత ఇర్ఫాన్ పఠాన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
కోహ్లీ 9 ఇన్నింగ్స్‌లలో 23.75 సగటుతో కేవలం 190 పరుగులు మాత్రమే చేశాడు. మొదటి టెస్టులో ఒక సెంచరీ చేసినా, తరువాత సరైన ఫామ్ అందుకోలేకపోయాడు.
Details
యువ ఆటగాడిని జట్టులోకి తీసుకోవాలి
2024లో కోహ్లీ టెస్టుల్లో 15 సగటుతో మాత్రమే ఆడుతున్నాడని, అతని గణాంకాలు గత ఐదేళ్లలో 30 కూడా దాటలేకపోయాయని పేర్కొన్నారు.
సీనియర్ ఆటగాడి నుంచి భారత్ ఈ స్థాయి ప్రదర్శన ఆశించేది కాదని పఠాన్ వ్యాఖ్యానించారు. భారత జట్టులో 'సూపర్ స్టార్ సంస్కృతి' వల్లే జట్టు ప్రదర్శనను ప్రభావితం చేస్తున్నట్లుగా ఆయన భావించారు.
జట్టు సంస్కృతిని ప్రోత్సహించాల్సిన సమయం వచ్చిందని, విరాట్ కోహ్లీ ఖాళీగా ఉన్నప్పుడు, అతను ఎప్పుడు దేశవాళీ క్రికెట్ ఆడాడో ప్రశ్నించారు.
సచిన్ టెండూల్కర్ కూడా క్రికెట్‌లో అత్యున్నత స్థాయికి చేరుకున్నా, డొమెస్టిక్ క్రికెట్ ఆడేందుకు ముందుకొచ్చారని ఆయన గుర్తుచేశారు.