లంక ప్రీమియర్ లీగ్‌లో ఆడనున్న సురేష్ రైనా.. ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
టీమిండియా మాజీ క్రికెటర్, చైన్నై సూపర్ కింగ్స్ దిగ్గజం సురేష్ రైనా 2023 ఎడిషన్ లంక ప్రీమియర్ లీగ్‌లో పాల్గొనే అవకాశం ఉంది. మిస్టర్ ఐపీఎల్ గా పేరు పొందిన రైనా.. గతేడాది జరిగిన మినీ ఐపీఎల్ వేలంలో అమ్ముడుపోని విషయం తెలిసిందే. అయితే రైనా మళ్లీ గ్రౌండ్ లో అడుగుపెట్టాలనే ఉద్ధేశంతో ఎల్‌పీఎల్‌లో తన పేరును ఎంట్రీ చేసుకున్నాడు. ముఖ్యంగా లంక ప్రీమియర్ లీగ్‌లో ఐదు జట్లు ఆడనున్నాయి. వేలంలో పాల్గొనే అంతర్జాతీయ, దేశీయ క్రికెటర్లు జాబితాను శ్రీలంక క్రికెట్ సోమవారం విడుదల చేసింది. ఈ జాబితాలో సురేష్ రైనా పేరు కూడా ఉంది. బేస్ ధర 50వేల డాలర్లతో రైనా తన పేరును ఎంట్రీ చేసుకున్నాడు.
205 ఐపీఎల్ మ్యాచులాడిన సురేష్ రైనా
లంక ప్రీమియర్ లీగ్‌లో ఐదు జట్లు ప్లేయర్లు కొనుగోలు చేసేందుకు 500,000 యూఎస్ డాలర్లను ఖర్చు చేయవచ్చు. ఈ లీగ్ లో ఆడేందుకు మొత్తం 140 మంది అంతర్జాతీయ ప్లేయర్లతో సహా మొత్తం 500 మందికి పైగా ఆటగాళ్ల తమ పేర్లను నమోదు చేసుకున్నారు. సురేష్ రైనా 205 ఐపీఎల్ మ్యాచుల్లో 5528 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ ఉంది. ఒక టీమిండియా ప్లేయర్ విదేశీ లీగ్ ల్లో ఆడాలంటే దేశవాళీ క్రికెట్ లోని అన్ని ఫార్మాట్లో నుంచి రిటైర్ కావాలి. రైనా గతేడాది సెప్టెంబర్‌లో రైనా అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకున్నాడు.