Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్ సంచలన రికార్డు.. ప్రపంచంలోనే రెండో ఆటగాడిగా!
టీ20ల్లో సూర్యకుమార్ యాదవ్ ఎట్టకేలకు మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. గయానా వేదికగా జరిగిన మూడో టీ20ల్లో విండీస్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. కేవలం 23 బంతుల్లోనే హాఫ్ సెంచరీని మార్కును అందుకొని సత్తా చాటాడు. ఈ మ్యాచుల్లో 44 బంతుల్లో (10 ఫోర్లు, 4 సిక్సర్లు) 83 పరుగులు చేశాడు. ఈ క్రమంలో సూర్యకుమార్ యాదవ్ పలు అరుదైన రికార్డులను బ్రేక్ చేశాడు. అంతర్జాతీయ టీ20ల్లో సూర్య 100 సిక్స్‌లను పూర్తి చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో టీ20ల్లో అత్యంత వేగంగా వంద సిక్సర్లు బాదిన రెండో ఆటగాడిగా సూర్యకుమార్ యాదవ్ చరిత్రకెక్కాడు. 49వ ఇన్నింగ్స్‌లో సూర్య, క్రిస్ గేల్ ఈ ఫీట్‌ను అందుకున్నారు.
టీమిండియా మూడో బ్యాటర్ గా సూర్యకుమార్ యాదవ్
విండీస్ బ్యాటర్ ఎవిన్ లూయిస్ 48 ఇన్నింగ్స్ లోనే ఈ ఘనతను సాధించి అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఇక టీమిండియా తరుపన టీ20ల్లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాటర్లలో సూర్యకుమార్ యాదవ్ (101) తో మూడో స్థానంలో నిలిచారు. అతని కంటే ముందు రోహిత్ శర్మ 182, విరాట్ కోహ్లీ 117 సిక్సర్లతో ముందు స్థానంలో ఉన్నారు. ఇక మ్యాచ్ విషయానికొస్తే.. మొదట బ్యాటింగ్ విండీస్ 5 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. లక్ష్య చేధనకు దిగిన భారత్ 17.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించి, విజయం సాధించింది.