NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / సూర్యకుమార్ యాదవ్‌కు వరల్డ్ జట్టులో చోటు కష్టమే : సునీల్ గవాస్కర్
    తదుపరి వార్తా కథనం
    సూర్యకుమార్ యాదవ్‌కు వరల్డ్ జట్టులో చోటు కష్టమే : సునీల్ గవాస్కర్
    సూర్యకుమార్ యాదవ్‌కు వరల్డ్ జట్టులో చోటు కష్టమే : సునీల్ గవాస్కర్

    సూర్యకుమార్ యాదవ్‌కు వరల్డ్ జట్టులో చోటు కష్టమే : సునీల్ గవాస్కర్

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Sep 29, 2023
    11:36 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ అద్భుతంగా రాణించారు.

    వరుసగా రెండు వన్డేల్లో హాఫ్ సెంచరీతో చెలరేగిన సూర్య, మూడో వన్డేలో నిరాశపరిచాడు. ముఖ్యంగా వరల్డ్ కప్ ముందు సూర్య, వన్డేలో ఫామ్‌లోకి రావడం శుభపరిణామం.

    ఈ నేపథ్యంలో సూర్యకుమార్‌ను ఉద్ధేశించి టీమిండియా మాజీ దిగ్గజం సునీల్ ఆసక్తికర వ్యాఖ్యలను చేశాడు.

    ఆసీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో సూర్యకుమార్ అద్భుతంగా రాణించచనప్పటికీ, వరల్డ్ కప్ తుది జట్టులో చోటు కష్టమేనని సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు.

    వన్డే క్రికెట్‌లో సూర్యకుమార్ ఇప్పటివరకూ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయాడని పేర్కొన్నారు.

    Details

    సూర్యకుమార్ యాదవ్ శతకం సాధించి నిరూపించుకోవాలి

    వన్డే క్రికెట్‌లో సూర్య చివరి 15 నుంచి 20 ఓవర్లు మాత్రమే బ్యాటింగ్ చేశాడని, ఆ సమయంలో టీ20 ఫార్మాట్ మాదిరిగా ఆడుతాడని, టీ20ల్లో అద్భుతమైన ఆటగాడనడంలో ఎలాంటి సందేహం లేదని సునీల్ గవాస్కర్ తెలిపారు.

    కానీ హార్ధిక్, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషాన్ కూడా ఆఖరి ఓవర్లో అద్భుతంగా రాణిస్తున్నారన్నారు.

    సూర్యకు ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కడం చాలా కష్టమని, ఇప్పటికే నాలుగో స్థానంలో శ్రేయస్ అయ్యర్ అదరగొడుతున్నాడని, ఒకవేళ నెంబర్ 4లో సూర్యకు అవకాశం లభిస్తే భారీ శతకం సాధించి నిరూపించుకోవాలని చెప్పారు.

    Details

    వన్డే ప్రపంచ కప్ కోసం భారత్ తుది జట్టు ఇదే

    భారత క్రికెట్ ప్రపంచ కప్ జట్టు

    రోహిత్ శర్మ (సి), హార్దిక్ పాండ్యా (విసి), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, రవిచంద్రన్ అశ్విన్ ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    సూర్యకుమార్ యాదవ్
    సునీల్ గవాస్కర్

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    సూర్యకుమార్ యాదవ్

    నాన్న వైస్ కెప్టెన్ అని మెసేజ్ పంపాడు : సూర్యకుమార్ యాదవ్ క్రికెట్
    ప్రతిష్టాత్మక అవార్డు రేసులో సూర్య, స్మృతి క్రికెట్
    నంబర్‌వన్ స్థానంలో సూర్యకుమార్ యాదవ్ క్రికెట్
    అక్షర్ ఆటకు అభిమానులు ఫిదా క్రికెట్

    సునీల్ గవాస్కర్

    గెలిస్తేనే కెప్టెన్లను గుర్తు పెట్టుకుంటారు.. రోహిత్ శర్మపై గవాస్కర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్! రోహిత్ శర్మ
    Sunil Gavaskar : భారత్.. వినడానికి వినసంపుగా ఉంది : సునీల్ గవాస్కర్ వీరేంద్ర సెహ్వాగ్
    టీమిండియాపై గవాస్కర్ ప్రశంసలు.. కొత్తబంతితో పాక్ కంటే భారత బౌలింగ్‌ అటాక్ భేష్ టీమిండియా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025