Suryakumar Yadav : ఒలింపిక్స్‌లో బంగారు పతకమే మా లక్ష్యం: సూర్యకుమార్
ఈ వార్తాకథనం ఏంటి
టీమిండియా టీ20 ప్రపంచకప్ విజయం తర్వాత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. దీనికి సంబంధించిన ఫోటోను బీసీసీఐ రిలీజ్ చేసింది. ఈ సందర్భంగా సూర్య కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. అభిమానుల మద్దతు, ఆశీస్సుల వల్లే ఈ విజయం సాధ్యమైందన్నారు. ఈ విజయం కేవలం జట్టు విజయం మాత్రమే కాకుండా మొత్తం భారత దేశానికి చెందిందని సూర్యకుమార్ యాదవ్ అన్నారు. చేతిలో బ్యాట్, బంతి పట్టుకుని పెద్ద కలలు కంటున్న చిన్నారులందరికీ ఈ విజయం అంకితమన్నారు. భారతదేశంలో క్రికెట్ కేవలం ఆట మాత్రమే కాదు, అది చెప్పలేని అనుభూతి అని ఆయన అన్నారు.
వివరాలు
తర్వాతి లక్ష్యం అదే..
భారత జట్టు తర్వాతి లక్ష్యం 2028 ఒలంపిక్స్‌లో బంగారు పతకం సాధించడమే అని సూర్యకుమార్ యాదవ్ వెల్లడించారు. అదే సంవత్సరం జరిగే తదుపరి టీ20 ప్రపంచకప్ పోటీల్లో కూడా విజేతగా నిలవడం జట్టు లక్ష్యమన్నారు.
వివరాలు
విజయంపైనే దృష్టి
ఈ ప్రపంచకప్ పోటీల్లో భారత ఆటగాళ్లు వ్యక్తిగత రికార్డుల కోసం కాకుండా జట్టు విజయంపై దృష్టి పెట్టారని సూర్యకుమార్ తెలిపారు. సెమీఫైనల్ వరకు అత్యధిక పరుగులు చేసిన, ఎక్కువ వికెట్లు తీసిన ఆటగాళ్ల జాబితాలో భారత ఆటగాళ్లు లేకపోయినా.. జట్టు సమిష్టిగా ఆడి విజయాన్ని సాధించిందన్నారు. గత 16 నుంచి 18 నెలలుగా ఇదే ఆలోచనతో జట్టు ముందుకు సాగుతోందని తెలిపారు.