
IPL 2025: సరికొత్త రికార్డ్ సృష్టించిన సూర్యకుమార్ యాదవ్.. 10 ఏళ్ల నాటి ఐపీఎల్ రికార్డును బ్రేక్
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్ 2025 సీజన్‌లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడుతున్న సూర్యకుమార్ యాదవ్ అరుదైన ఘనతను తన పేరుతో లిఖించుకున్నాడు.
వరుసగా 11 ఇన్నింగ్స్‌ల్లో 25కంటే ఎక్కువ పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు.
ఈక్రమంలో 2014లో కోల్‌కతా నైట్‌రైడర్స్ తరఫున రాబిన్ ఉతప్ప నెలకొల్పిన రికార్డును అధిగమించాడు.
అప్పట్లో ఉతప్ప 10 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధించాడు. తాజా ప్రదర్శనతో సూర్యకుమార్ యాదవ్, సాయి సుదర్శన్‌ను అధిగమించి ఆరెంజ్ క్యాప్ పోటీలో మొదటి స్థానాన్ని ఆక్రమించాడు.
వివరాలు
రోహిత్, హార్దిక్‌తో కలిసి మెరుపులు
జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ర్యాన్ రికెల్టన్ అవుట్ అయిన అనంతరం సూర్య క్రీజులోకి దిగాడు.
మొదట రోహిత్ శర్మతో, అనంతరం హార్దిక్ పాండ్యాతో భాగస్వామ్యం చేస్తూ కేవలం 23 బంతుల్లో 48 పరుగులు చేశాడు.
హాఫ్ సెంచరీని కొద్దిగా మిస్ చేసినప్పటికీ, అతని ఆగడాలతో ముంబై స్కోరు 200 దాటింది.
ఐపీఎల్ 2025లో ఇప్పటి వరకు సూర్యకుమార్ 11 ఇన్నింగ్స్‌లలో 29, 48, 27*, 67, 28, 40, 26, 68*, 40*, 54, 48* పరుగులు చేశాడు.
అతని అద్భుతమైన నిలకడ కారణంగానే లీగ్ దశలో 50 మ్యాచ్‌లు పూర్తి చేసిన తర్వాత ఆరెంజ్ క్యాపులో టాప్‌లోకి చేరాడు.
వివరాలు
ఐపీఎల్‌లో వరుసగా 25పైగా పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితా
11 ఇన్నింగ్స్‌లు - సూర్యకుమార్ యాదవ్ (2025)*
10 ఇన్నింగ్స్‌లు - రాబిన్ ఉతప్ప (2014)
9 ఇన్నింగ్స్‌లు - విరాట్ కోహ్లీ (2024-25)
9 ఇన్నింగ్స్‌లు - స్టీవ్ స్మిత్ (2016-17)
9 ఇన్నింగ్స్‌లు - సాయి సుదర్శన్ (2023-24)
వివరాలు
ఇంకా ఎన్నో రికార్డుల వైపు
ఇప్పటి వరకూ ఈ సీజన్‌లో సూర్యకుమార్ 67.85 సగటుతో 172.72 స్ట్రైక్‌రేట్‌తో 475 పరుగులు చేశాడు.
ఇందులో అతను 46 ఫోర్లు, 26 సిక్సర్లు బాదాడు. ఇదే ఫామ్ కొనసాగితే సీజన్ ముగిసే నాటికి మరికొన్ని కీలక రికార్డులు అతని ఖాతాలో చేరే అవకాశముంది.
అలాగే ముంబై ఇండియన్స్ టైటిల్ కోసం పోటీ పటిష్టంగా కొనసాగించగలదన్న ఆశను అతని బ్యాటింగ్ ఇవ్వగలదు.
వివరాలు
IPL 2025 ఆరెంజ్ క్యాప్ టాప్ 5 బ్యాట్స్‌మెన్
సూర్యకుమార్ యాదవ్ - 475 పరుగులు
సాయి సుదర్శన్ - 456 పరుగులు
విరాట్ కోహ్లీ - 443 పరుగులు
యశస్వి జైస్వాల్ - 439 పరుగులు
జోస్ బట్లర్ - 406 పరుగులు