T10 Tournament: యూఎస్‌ఏలో టీ10 లీగ్.. క్రికెట్‌కు విభిన్న ఫార్మాట్లు కొత్త వెలుగులు
అమెరికాలో క్రికెట్‌కి ఆదరణ రోజు రోజుకూ పెరుగుతోంది. గత టీ20 ప్రపంచకప్ సందర్భంగా యూఎస్ఏ అతిథిగా వ్యవహరించిందన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో క్రికెట్‌ను విస్తరించేందుకు ఐసీసీ ప్రత్యేక శ్రద్ధ చూపుతోంది. తాజాగా యూఎస్‌లో 'నేషనల్ క్రికెట్ లీగ్ సిక్స్టీ స్ట్రైకర్స్' టోర్నీ జరుగుతోంది. ప్రముఖ క్రికెటర్లు దీని ద్వారా అభిమానులకు విజ్ఞానాన్ని అందిస్తున్నారు. ఈ టోర్నీలో దిగ్గజ ఆటగాళ్లు దినేశ్ కార్తిక్, షాహిద్ అఫ్రిది, కొలిన్ మున్రో, సురేశ్ రైనా వంటి వారు పాల్గొంటున్నారు. ఆటగాళ్లకు క్రికెట్‌లో కొత్త అవకాశాలను అందించడానికి ఎన్‌సీఎల్ లాంటి టోర్నీలు కీలకమని క్రికెట్ లెజెండ్ సునీల్ గావస్కర్ అభిప్రాయపడ్డారు.
చికాగోపై అట్లాంటా కింగ్స్ విజయం
అట్లాంటా కింగ్స్ 23 పరుగుల తేడాతో చికాగోపై విజయం సాధించిన మ్యాచ్‌లో వ్యాఖ్యాతగా వ్యవహరించిన సునీల్ గావాస్కర్, ఈ టోర్నీ ప్రతి ఫార్మాట్‌ను మెరుగుపర్చే ఒక మంచి మలుపు అని తెలిపారు. ప్రతి ఫార్మాట్ క్రికెట్‌ను మరింత ఆసక్తికరంగా, ఉత్తమంగా తీర్చిదిద్దడానికి ఉపయోగపడాలని, ఆటగాళ్లు కొత్త నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడానికి ఇదొక చక్కటి అవకాశమని ఆయన అన్నారు. ఆటగాళ్లు విభిన్నమైన బంతులు వేయడం, నూతన రకాల షాట్లను ఆడడం ద్వారా తమ నైపుణ్యాలను మెరుగుపర్చవచ్చని గావస్కర్ అభిప్రాయపడ్డారు.
అమెరికాలో పిచ్ లు విభిన్నం
ఇక్కడి పిచ్‌లు కూడా ఇతర దేశాలతో పోలిస్తే భిన్నంగా ఉంటాయని, డ్రాప్ ఇన్ పిచ్‌ల కారణంగా కఠినమైన పరిస్థితులను ఎదుర్కొనాల్సి ఉంటుందని, అయినా ఓపికగా ఉంటే బ్యాటింగ్ చేయడం సులభమని ఆయన వివరించారు. ప్రముఖ పాకిస్థాన్ క్రికెటర్ వసీమ్ అక్రమ్, సచిన్ టెండూల్కర్ ఈ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించడం క్రికెట్‌కి ఎంతో ప్రయోజనకరమని అభిప్రాయపడ్డారు. సచిన్ క్రికెట్ ప్రపంచంలో అత్యుత్తమ ఆటగాడిని, అతడి రాకతో ఈ టోర్నీకి కొత్త ఉత్సాహం వచ్చిందన్నారు. మాస్టర్ బ్లాస్టర్‌తో తనకు స్నేహం చాలా కాలంగా ఉందని, అతడిని మళ్ళీ చూడటానికి ఎదురు చూస్తున్నానని అక్రమ్ అన్నారు.