
టీ20 ప్రపంచకప్ 2024లో ఐసీసీ కీలక నిర్ణయం.. అమెరికాలో మూడు వేదికలు ఖరారు
ఈ వార్తాకథనం ఏంటి
టీ20 ప్రపంచకప్- 2024 మెగా టోర్నీకి సంబంధించి అగ్రరాజ్యం అమెరికాలో వేదికలు సిద్ధమయ్యాయి. ఈ మేరకు మూడు మైదానాల్లో మ్యాచ్‌లను నిర్వహించాలని ఐసీసీ ఖరారు చేసింది.
వచ్చే ఏడాది జరగనున్న టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో వెస్టిండీస్-యూఎస్‌ఏ సంయుక్తంగా అతిథ్యం ఇవ్వనున్నాయి.
1.డల్లాస్‌లోని గ్రాండ్ ప్రైరీ
2. ఫ్లోరిడాలోని బ్రోవార్డ్ కౌంటీ
3. న్యూయార్క్‌లోని నసౌ కౌంటీ స్టేడియం ఖరారయ్యాయి
దాదాపుగా 20 దేశాలు ఈ పొట్టి కప్ కోసం 2024లో పోటీపడనున్నాయి. ప్రపంచకప్ కోసం ఎంపిక చేసిన క్రికెట్ స్టేడియాల్లో మాడ్యూలర్ విధానంలో అత్యాధునిక సౌకర్యాలను కల్పించాలని నిర్ణయం తీసుకున్నట్లు ఐసీసీ సీఈవో జెఫ్ అల్డారిస్ తెలిపారు.
అంతర్జాతీయ క్రికెట్ విస్తరణకు యూఎస్‌ఏ వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైందని జెఫ్ అల్డారిస్ అభిప్రాయపడ్డారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
టీ-20 ప్రపంచకప్ 2024 : వెస్టిండీస్-యూఎస్‌ఏ సంయుక్త అతిథ్యం
📍The United States of America
— ICC (@ICC) September 20, 2023
🏆 ICC Men’s #T20WorldCup 2024
Three venues in the USA have been confirmed for the mega-event next year 🤩