INDw vs ENGw: నేడు ఇంగ్లండ్‌తో టీ20.. భారత్ గెలిచేనా?
భారత మహిళల క్రికెట్ మరో సవాల్‌కు ఎదురైంది. బలమైన ఇంగ్లండ్ జట్టుతో మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచులో నేడు తలపడనుంది. హర్మన్ ప్రీత్ కౌర్(Harman Preet Kaur) సారథ్యంలోని భారత జట్టు(Indian team) ఏడాది టీ20ల్లో మెరుగ్గా రాణించింది. ఈ ఫార్మాట్లో ఆసియా క్రీడల్లో పసిడి గెలిచి సత్తా చాటింది. ఇక బంగ్లాదేశ్‌పై 2-1తో సిరీస్ సాధించింది. మరోవైపు దక్షిణాఫ్రికాలో జరిగిన ముక్కోణపు టోర్నీలో కూడా ఫైనల్‌కు చేరింది. ఇక స్వదేశంలో ఇంగ్లండ్ పై భారత్ గొప్ప రికార్డు లేకపోవడం కలవరపడుతోంది. తొమ్మిది మ్యాచుల్లో కేవలం రెండింట్లోనూ నెగ్గింది. చివరిగా 2018లో ఆ జట్టుపై గెలుపొందింది.
భారత జట్టు ఓడించడం కష్టమే : హెథర్ నైట్
భారత్ బ్యాటింగ్‌లో స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ తప్పక రాణించాల్సి ఉంది. ఇటీవల మహిళల బిగ్ బాష్ లీగ్‌లో హర్మన్ 14 మ్యాచుల్లో 321 రన్స్ చేసింది. భారత్ పై విజయం సాధించాలని ఇంగ్లండ్ గట్టి పట్టుదలతో ఉంది. కెప్టెన్ హెథర్ నైట్, నాట్ సీవర్, ఎకిల్ స్టోన్ రాణిస్తే భారత జట్టుకు కష్టాలు తప్పవు. ఇక భారత్ పిచ్‌లపై ఆడడం తమ జట్టుకు పెద్ద సవాల్ అని, సొంతగడ్డపై భారత్‌ను ఓడించడం అంత తేలికేం కాదని ఇంగ్లండ్ కెప్టెన్ హెథర్ నైట్ పేర్కొంది. టీ20 సిరీస్‌లో భారత మహిళల జట్టు నిర్భయంగా ఆడాలని చీఫ్ కోచ్ అమోల్ మజుందార్ పేర్కొన్నాడు.