
ICC Rankings: టీ20 ర్యాంకింగ్స్.. నంబర్ వన్ బౌలర్‌గా డఫీ
ఈ వార్తాకథనం ఏంటి
గత రెండు వారాలుగా టీమిండియా ఆటగాళ్లు అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడకపోయినా, ఐసీసీ ర్యాంకింగ్స్‌లో కొందరు టాప్‌లోనే కొనసాగుతుండగా, మరికొందరు ర్యాంకుల్లో కిందికి పడిపోయారు.
టీ20 బౌలింగ్ విభాగంలో కివీస్ పేసర్ జాకబ్ డఫీ (723 పాయింట్లు) అగ్రస్థానానికి ఎగబాకాడు.
ఇలా ఏదైనా ఫార్మాట్‌లో టాప్ ర్యాంక్‌ను అందుకున్న తొలి కివీస్ పేస్ బౌలర్‌గా నిలిచాడు. 2018లో న్యూజిలాండ్‌కు చెందిన ఐష్ సోధి మాత్రమే టాప్ ర్యాంక్‌లో నిలిచాడు.
అయితే అతడు స్పిన్నర్. టీ20 బౌలర్ల జాబితాలో అకీల్ హుసేన్ (707), భారత మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి (706) ఒక్కో స్థానం దిగజారారు.
Details
టీ20 ర్యాంకింగ్స్
భారత ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య (252) టాప్ ఆల్‌రౌండర్‌గా కొనసాగుతున్నాడు. ఈ జాబితాలో టాప్ 10లో మరే ఇతర టీమ్ఇండియా ఆటగాడు లేడు.
12వ స్థానంలో అక్షర్ పటేల్ (161) ఉన్నాడు. బ్యాటింగ్ విభాగంలో మాత్రం భారత ఆటగాళ్లకు మంచి స్థానం దక్కింది.
రెండో స్థానంలో అభిషేక్ శర్మ (829), నాలుగో స్థానంలో తిలక్ వర్మ (804), ఐదో స్థానంలో సూర్యకుమార్ యాదవ్ (739) ఉన్నారు.
అగ్రస్థానంలో మాత్రం ఆస్ట్రేలియా డేంజరస్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ (856) కొనసాగుతున్నాడు.
Details
వన్డే ర్యాంకింగ్స్
వన్డేల్లో భారత యువ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ (784) అగ్రస్థానంలో కొనసాగుతుండగా, పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ (777) రెండో స్థానంలో ఉన్నాడు.
మూడో స్థానంలో రోహిత్ శర్మ (756), ఐదో స్థానంలో విరాట్ కోహ్లీ (736), ఎనిమిది స్థానంలో శ్రేయస్ అయ్యర్ (704) ఎనిమిదో స్థానంలో ఉన్నారు.
వన్డే బౌలర్ల జాబితాలో కుల్‌దీప్ యాదవ్ (650) మూడో స్థానానికి ఎగబాకాడు. రవీంద్ర జడేజా (616) ఒక స్థానం మెరుగుపర్చుకుని 9వ స్థానానికి చేరాడు.
టీమిండియా ఆటగాళ్లు అంతర్జాతీయ మ్యాచ్‌లకు దూరంగా ఉన్నా, చాలా విభాగాల్లో టాప్-10లో తమ స్థానాలను నిలుపుకున్నారు.