IND Vs AFG: జనవరిలో ఆప్ఘాన్‌తో టీ20 సిరీస్.. టీమిండియా కొత్త కెప్టెన్ ఎవరంటే?
ఈ వార్తాకథనం ఏంటి
జనవరిలో ఆప్ఘనిస్తాన్‌తో టీమిండియా టీ20 సిరీస్ ఆడనుంది. ఈ మూడు మ్యాచుల సిరీస్‌కు భారత జట్టును మరో వారం రోజుల్లో ప్రకటించే అవకాశం ఉంది.
ఈ మ్యాచులకు టీమిండియా కెప్టెన్ ఎవరన్నది ఆసక్తికరంగా మారింది.
ఇప్పటికే టీ20ల్లో భారత జట్టుకు హర్ధిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, రుతురాజ్ గైక్వాడ్ సారథిలుగా వ్యవహరించారు.
అయితే వీరంతా గాయాల భారీన పడ్డారు. వరల్డ్ కప్‌లో గాయపడ్డ హార్ధిక్ పాండ్యా ప్రస్తుతం జట్టుకు దూరమయ్యాడు.
ఇక సౌతాఫ్రికాతో జరిగిన మూడో టీ20ల్లో ఫీల్డింగ్ చేస్తూ సూర్యకుమార్ యాదవ్, రుతురాజ్ గైక్వాడ్ గాయపడ్డారు.
ఈ క్రమంలో జట్టు పగ్గాలు ఎవరికి అప్పజెప్పాలని బీసీసీఐ తలలు పట్టుకుంటోంది.
Details
కెప్టెన్సీ రేసులో రవీంద్ర జడేజా, శ్రేయస్ అయ్యర్
గత కొంతకాలంగా టీ20లకు దూరంగా ఉంటున్న భారత రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మతో బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ చర్చలు జరిపినట్లు తెలస్తోంది.
అయితే హిట్ మ్యాన్ తన నిర్ణయాన్ని వెల్లడించేందుకు కొన్ని రోజుల సమయం కోరినట్లు సమాచారం.
ఒకవేళ రోహిత్ అంగీకరించకపోతే స్పిన్నర్ రవీంద్ర జడేజా లేదా శ్రేయస్ అయ్యర్ పేర్లు పరిశీలన ఉన్నట్లు తెలిసింది.
ఈ ఇద్దరిలో ఎవరు కెప్టెన్ అన్నది జనరవి ఫస్ట్ వీక్‌లో తేలనుంది. ఆఫ్గాన్‌తో టీ20 సిరీస్ జనవరి 11 నుంచి 17 వరకు జరగనుంది.