IND vs ENG: భారత్‌తో టీ20 సిరీస్.. ఇంగ్లాండ్ జట్టులో కీలక మార్పులు
ఈ వార్తాకథనం ఏంటి
టెస్టు సిరీస్‌లలో వరుస వైఫల్యాల తర్వాత, భారత జట్టు, ఇంగ్లండ్‌తో 5 టీ20ల సిరీస్‌కు సిద్ధమైంది. ఈ సిరీస్ రేపటి నుంచి ప్రారంభం కానుంది.
ఇక ఫిబ్రవరి 6 నుండి వన్డే సిరీస్ కూడా మొదలవుతుంది. రెండు జట్లు సమానంగా ఉన్నట్లుగా కనిపిస్తాయి, భారీ సిక్సర్లు, బౌండరీలు, చెలరేగే ఆల్‌రౌండర్లతో ఈ పొట్టి ఫార్మాట్ ప్రీ-చాంపియన్స్ ట్రోఫీ సమరానికి వినోదం అందించబోతుంది.
ఈ సిరీస్ కోసం ఇంగ్లండ్ తమ తుది జట్టును ప్రకటించింది. టీ20ల్లో కెరీర్‌లో మూడు మ్యాచ్‌లు ఆడిన గస్ అట్కిన్సన్ ఏడాది తర్వాత మళ్లీ టీ20లోకి వచ్చాడు.
ఇతను చివరిగా 2023 డిసెంబరులో వెస్టిండీస్‌తో ఆడిన టీ20లో పాల్గొన్నాడు.
Details
ఏకైక స్పెషలిస్టు స్పిన్నర్‌గా అదిల్ రషీద్ ఎంపిక
ఆదిల్ రషీద్ ఈ జట్టులో ఏకైక స్పెషలిస్టు స్పిన్నర్‌గా ఉన్నాడు. ఇక పార్ట్‌టైమ్ స్పిన్నర్లు లివింగ్‌స్టన్, జాకబ్ బేతల్ లను కూడా ఎంపిక చేశారు.
యువ బ్యాటర్ హ్యారీ బ్రూక్‌ను ఇంగ్లాండ్ తమ పరిమిత ఓవర్ల వైస్ కెప్టెన్‌గా నియమించింది.
భారత్-ఇంగ్లాండ్ మధ్య ఇప్పటివరకు 24 టీ20లు జరగ్గా, అందులో ఇంగ్లాండ్ 11 మ్యాచ్‌ల్లో విజయాన్ని సాధించింది. భారత్‌లో 11 మ్యాచ్‌లు ఆడిన ఇంగ్లండ్ జట్టు ఐదు సార్లు గెలిచింది.
Details
ఇంగ్లండ్ జట్టు ఇదే
బెన్ డకెట్, ఫిల్ సాల్ట్ (వికెట్ కీపర్), జోస్ బట్లర్ (కెప్టెన్), హ్యారీ బ్రూక్, లియామ్ లివింగ్‌స్టోన్, జాకబ్ బెథెల్,
జేమీ ఓవర్టన్, గస్ అట్కిన్సన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్.