
Rohit Sharma: 'టీ20 వరల్డ్‌కప్ 2024 స్పెషల్.. ఎందుకంటే ఇది నా చివరిది'.. రోహిత్ శర్మ
ఈ వార్తాకథనం ఏంటి
గత ఏడాది వ్యవధిలో భారత జట్టు రెండు ఐసీసీ ట్రోఫీలను కైవసం చేసుకోవడం విశేషం. వీటిని రోహిత్ శర్మ నాయకత్వంలోనే గెలుచుకోవడం ప్రత్యేకంగా నిలిచింది.
2023లో టీ20 ప్రపంచకప్, అలాగే తాజాగా ముగిసిన ఛాంపియన్స్ ట్రోఫీను భారత జట్టు గెలుచుకుంది. ఈ రెండు టోర్నమెంట్లలో ఒక్క మ్యాచ్‌లో కూడా ఓడిపోకపోవడం గమనార్హం.
2023 టీ20 వరల్డ్‌కప్ అనంతరం రోహిత్ పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు పలికాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో 2022 టీ20 వరల్డ్‌కప్ అనంతరం తన మైండ్‌సెట్ మారిపోయిందని చెప్పుకొచ్చాడు.
2022 టీ20 ప్రపంచకప్‌లో సెమీఫైనల్‌లో ఇంగ్లండ్ చేతిలో 10 వికెట్ల తేడాతో ఓటమి తర్వాతే తాము కొత్త ప్రణాళికలు రచించామని రోహిత్ తెలిపాడు. ప్లేయర్లకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చామని కల్పించామని చెప్పాడు.
Details
23 మ్యాచుల్లో 22 విజయాలు
ఒకవేళ తాము 2023 వన్డే ప్రపంచకప్‌ను కూడా గెలిచివుంటే, మూడు ట్రోఫీలు ఒక్క ఓటమి లేకుండా సాధించడం క్రేజీగా ఉండేది. కానీ, అలా జరగలేదన్నారు. 23 మ్యాచుల్లో 22 విజయాలు సాధించామని, కొన్ని క్లిష్ట సమయాల్లో ఒత్తిడిని ఎదుర్కొన్నానని తెలిపారు.
ఇక 2024 ఐపీఎల్ సీజన్‌లో ముంబయి ఇండియన్స్ పాయింట్ల పట్టికలో చివరికి పరిమితమైంది. కెప్టెన్సీ మార్పు జట్టు ప్రదర్శనపై ప్రభావం చూపిందని అనుకోవడం తప్పు కాదని రోహిత్ అన్నాడు.
టీ20 వరల్డ్‌కప్ తన చివరిదేనని ముందే అర్థమైందని, అందుకే దానిని ప్రత్యేకంగా మార్చుకోవాలని భావించినట్లు చెప్పాడు.
సహచర ఆటగాళ్ల సహకారం లేకపోతే తాము ఛాంపియన్‌గా నిలిచేవాళ్లం కాదని రోహిత్ గుర్తు చేసుకున్నాడు.