LOADING...
T20 World Cup: మెన్స్ టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ విడుదల.. అహ్మదాబాద్ లో ఫైనల్ 
మెన్స్ టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ విడుదల.. అహ్మదాబాద్ లో ఫైనల్

T20 World Cup: మెన్స్ టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ విడుదల.. అహ్మదాబాద్ లో ఫైనల్ 

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 25, 2025
07:33 pm

ఈ వార్తాకథనం ఏంటి

వచ్చే సంవత్సరం జరగబోయే టీ20 ప్రపంచకప్‌ 2026 షెడ్యూల్‌ను ఐసీసీ అధికారికంగా ప్రకటించింది. ఈ టోర్నమెంట్‌కు భారత్-శ్రీలంక దేశాలు సంయుక్త ఆతిథ్యాన్ని ఇవ్వనున్నాయి. ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు నెలరోజులపాటు ఈ మహా క్రీడా పోరాటం కొనసాగనుంది. ఈసారి గ్రూపింగ్‌లో ప్రత్యేక ఆకర్షణగా భారత్-పాకిస్థాన్ జట్లు ఒకే గ్రూప్‌లోకి చేరాయి. ఈ రెండు జట్ల మధ్య జరిగే హై-వోల్టేజ్ పోరు ఫిబ్రవరి 16న కొలంబోలో నిర్వహించనున్నారు. గత సంచికలాగే ఈ ఏడాది కూడా మొత్తం 20జట్లు టోర్నమెంట్‌లో పాల్గొననున్నాయి. ఇందులో ప్రత్యేకంగా ఇటలీ తొలిసారిగా అర్హత సాధించడం విశేషం. ఈ 20 జట్లను నాలుగు గ్రూప్‌లుగా విభజించారు. ప్రతి గ్రూప్ నుంచి రెండు చొప్పున జట్లు సూపర్-8 దశకు చేరనున్నాయి.

వివరాలు 

టీ20 వరల్డ్ కప్ 2026 బ్రాండ్ అంబాసడర్‌గా రోహిత్ శర్మ 

తరువాత సూపర్-8లోని ఎనిమిది జట్లను మరోసారి రెండు గ్రూప్‌లుగా విభజిస్తారు. ఇందులో టాప్-2 జట్లు సెమీ ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి మ్యాచ్‌ల నిర్వహణకు సంబంధించి, భారత్‌లోని ఐదు వేదికలు.. అహ్మదాబాద్, దిల్లీ, కోల్‌కతా, చెన్నై, ముంబయి.. సిద్ధంగా ఉన్నాయి. అలాగే శ్రీలంకలోని మూడు స్టేడియాలు.. క్యాండీ పల్లెకెలె, అలాగే కొలంబోలోని రెండు వేదికలలో జరగనున్నాయి. షెడ్యూల్‌ విడుదల వేడుకలో భారత మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ, ప్రస్తుత టీ20 సారథి సూర్యకుమార్ యాదవ్, మహిళల జట్టు నాయకురాలు హర్మన్‌ప్రీత్ కౌర్ హాజరయ్యారు. భారత్‌కు 2024 ప్రపంచ కప్‌ను అందించిన రోహిత్ శర్మను ఈసారి టీ20 వరల్డ్ కప్ 2026 బ్రాండ్ అంబాసడర్‌గా నియమించారు.