T20 World Cup 2026 schedule: 2026 టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ ఈరోజు సాయంత్రం విడుదల
ఈ వార్తాకథనం ఏంటి
ఫిబ్రవరి 7 నుండి మార్చి 8 వరకు భారత్-శ్రీలంక దేశాలు కలిసి ఆతిథ్యం ఇచ్చే 2026 టీ20 వరల్డ్ కప్ (ICC Men's T20 World Cup) షెడ్యూల్‌ను ఈ రోజు (సోమవారం) సాయంత్రం 6:30 గంటలకు విడుదల చేయనున్నారు. ఈసారి జరగనున్న మహత్తర టోర్నీలో మొత్తం 20 దేశాల జట్లు పోటీపడనున్నాయి. భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్, యూఏఈ, ఒమన్, వెస్టిండీస్, యూఎస్‌ఏ, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, నమీబియా, జింబాబ్వే, ఐర్లాండ్, ఇంగ్లాండ్, నెదర్లాండ్స్, ఇటలీ, నేపాల్, పాకిస్థాన్ తలపడనున్నాయి.
వివరాలు
డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి టీమిండియా
మ్యాచ్‌లు భారత్‌లోని అహ్మదాబాద్, దిల్లీ, కోల్‌కతా, చెన్నై, ముంబయి నగరాల్లోని ఐదు స్టేడియాల్లో, అలాగే శ్రీలంకలోని మూడు వేదికల్లో జరగనున్నట్లు సమాచారం. టోర్నీ ప్రారంభ మ్యాచ్‌తో పాటు గ్రాండ్ ఫైనల్‌ను కూడా అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియంలో నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. అయితే, పాకిస్థాన్ ఫైనల్‌కు అర్హత సాధిస్తే మాత్రం నిర్ణాయక పోరును శ్రీలంకలోని కొలంబోలోకి మార్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. సెమీఫైనల్స్‌లో ఒక మ్యాచ్‌ను ముంబయిలోని వాంఖడే స్టేడియంలో ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం టైటిల్ హోల్డర్‌గా ఉన్న టీమ్ ఇండియా, ఈ టోర్నీలో డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగనుంది.