T20 World Cup 2024: టీ20 ప్రపంచ కప్ కు ఉగ్రదాడి భయం..?
ఈ వార్తాకథనం ఏంటి
టి20 ప్రపంచ కప్ 2024 జూన్ 2 నుండి వెస్టిండీస్, అమెరికాలో ప్రారంభమవుతుంది.
దీనిలో భారతదేశం,పాకిస్థాన్ మధ్య జూన్ 9 న న్యూయార్క్‌లో అతిపెద్ద మ్యాచ్ జరుగుతుంది.
అయితే వరల్డ్ కప్ 2024కు ఉగ్ర ముప్పు పొంచి ఉన్నట్లు సమాచారం. కరేబియన్ మీడియాను ఉటంకిస్తూ, ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ దాడులకు పాల్పడాలని ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ఘనిస్తాన్-పాకిస్తాన్ బ్రాంచ్ (IS-Khorasan) పిలునిచ్చినట్లు సమాచారం.
ప్రో ఇస్లామిక్ స్టేట్ (IS) మీడియా వర్గాలు హింసను ప్రేరేపించే విధంగా ప్రచారాలు చేస్తున్నట్లు తెలుస్తుంది.
తమ మద్దతుదారులంతా యుద్ధ రంగంలోకి దిగాలని పిలుపునిస్తున్నాయి. దీని తరువాత, క్రికెట్ వెస్టిండీస్ టోర్నమెంట్‌కు పటిష్టమైన, గట్టి భద్రతకు హామీ ఇచ్చింది.
Details
టోర్నీ భద్రతపై నిర్వాహకుల ఆందోళన
దాదాపు నెల రోజుల పాటు జరిగే ప్రపంచకప్‌లో ఈసారి భారత్‌తో సహా మొత్తం 20 జట్లు పాల్గొంటున్నాయి.
టీ20 ప్రపంచకప్‌లో ఇదే అతిపెద్దది. అలాగే తొలిసారిగా అమెరికాలో ఈ టోర్నీని నిర్వహిస్తున్నందున యావత్ ప్రపంచం దృష్టి దీనిపైనే ఉంటుంది.
ఇలాంటి పరిస్థితుల్లో టోర్నీలో సెక్యూరిటీ ఛాలెంజ్ ఎదురుకానుండడంతో ఇప్పుడు ఈ ముప్పు టోర్నీ భద్రతపై నిర్వాహకుల ఆందోళనను మరింత పెంచింది.
Details
కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు
ఈ అంశంపై క్రికెట్ వెస్టిండీస్ క్రికెట్ బోర్డు స్పందించింది. తమ దేశంలో జరిగే ప్రపంచకప్ మ్యాచ్‌లకు ఎలాంటి ఆటంకం జరగదని హామీ ఇచ్చింది.
ఈ మెగా ఈవెంట్ కి సంబంధించి భద్రతాపరమైన అన్ని ఏర్పాట్లు కట్టుదిట్టం చేస్తున్నామన్నారు.
క్రికెట్ ఫ్యాన్స్ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఈ టోర్నీ సజావుగా సాగుతుందని క్రికెట్ వెస్టిండీస్ సీఈఓ జానీ గ్రేవ్స్ వెల్లడించారు.
టీ20 ప్రపంచకప్ 2024కు వెస్టిండీస్‌తో పాటు అమెరికా కూడా ఆతిథ్యమిస్తుంది.
Details
ఇవి ప్రపంచకప్‌కు వేదికలు
ICC పురుషుల T20 ప్రపంచ కప్ 6 కరేబియన్ దేశాల్లో జరగనుంది. ఇది ఆంటిగ్వా , బార్బుడా, బార్బడోస్, గయానా, సెయింట్ లూసియా, సెయింట్ విన్సెంట్, గ్రెనడైన్స్, ట్రినిడాడ్, టొబాగోలో జరుగుతుంది.
ఇదే కాకుండా తొలిసారిగా అమెరికాలో క్రికెట్ వరల్డ్ కప్ నిర్వహిస్తున్నారు.
ఇందుకోసం ఫ్లోరిడా, న్యూయార్క్, టెక్సాస్ రాష్ట్రాలను ఎంపిక చేశారు.
టీమ్ ఇండియా తన గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లను న్యూయార్క్, ఫ్లోరిడాలో ఆడనుంది. ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ బార్బడోస్‌లో జరగనుంది.