T20 World Cup 2024:సూపర్-8లో అఫ్గాన్‌పై భారత్ 47 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం
ఈ వార్తాకథనం ఏంటి
రోహిత్ శర్మ సారథ్యంలో, భారత జట్టు టీ20 ప్రపంచకప్ 2024 సూపర్-8లో అద్భుతమైన విజయంతో ప్రారంభించింది.
వెస్టిండీస్‌లో జరుగుతున్న సూపర్-8లో గురువారం ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు 47 పరుగుల తేడాతో విజయం సాధించింది.
మెరిసిన సూర్య, పాండ్యా
ఈ మ్యాచ్‌లో భారత జట్టుకు సరైన ఆరంభం దక్కలేదు. టీమిండియా 11 పరుగుల వద్ద రోహిత్ శర్మ (8) రూపంలో తొలి వికెట్ కోల్పోయింది.
ఆ తర్వాత రిషబ్ పంత్ (20),విరాట్ కోహ్లి (24)లు జట్టుపై కాస్త పట్టు సాధించారు.అనంతరం 90 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా బాధ్యతలు చేపట్టారు.వీరిద్దరూ 37 బంతుల్లో 60 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.
వివరాలు
స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌కు అవకాశం
సూర్య 27 బంతుల్లో వరుసగా రెండో అర్ధశతకం సాధించాడు. 28 బంతుల్లో 53 పరుగులు చేసి ఔటయ్యాడు. సూర్య 3 సిక్సర్లు, 5 ఫోర్లు బాదాడు. అతని స్ట్రైక్ రేట్ 189.28.
పాండ్యా 24 బంతుల్లో 32 పరుగులు చేశాడు.2 సిక్స్‌లు,3ఫోర్లు బాదాడు.వీరి భాగస్వామ్యంతో భారత జట్టు 8 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది.
మరోవైపు అఫ్గానిస్థాన్ తరఫున కెప్టెన్ రషీద్ ఖాన్,ఫజల్హక్ ఫరూఖీ చెరో 3 వికెట్లు తీశారు.నవీన్ ఉల్ హక్ 1 వికెట్ తీశాడు.
ఈ మ్యాచ్‌లో భారత కెప్టెన్ రోహిత్ తన ప్లేయింగ్-11లో మార్పు చేశాడు.ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్‌ను పక్కనపెట్టి స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌కు అవకాశం ఇచ్చాడు. ఈ ప్రపంచకప్‌లో కుల్దీప్కి ఇదే తొలి మ్యాచ్.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
Twitter Post
WT20 2024. India Won by 47 Run(s) https://t.co/gzppPXf843 #T20WorldCup #AFGvIND
— BCCI (@BCCI) June 20, 2024