Page Loader
T20-World cup-Promo-Team India: గూస్ బంప్స్ తెప్పిస్తున్న టీ20 వరల్డ్ కప్ టీమిండియా ప్రోమో వీడియో
గూస్ బంప్స్ తెప్పిస్తున్న టీ20 వరల్డ్ కప్ టీమిండియా ప్రోమో వీడియో

T20-World cup-Promo-Team India: గూస్ బంప్స్ తెప్పిస్తున్న టీ20 వరల్డ్ కప్ టీమిండియా ప్రోమో వీడియో

వ్రాసిన వారు Stalin
Apr 23, 2024
03:26 pm

ఈ వార్తాకథనం ఏంటి

జూన్ 1 నుంచి వెస్టిండీస్ (West indies), అమెరికా (America)లో జరగనున్న టి20 వరల్డ్ కప్ కు ఇప్పటికే సన్నాహాలు ప్రారంభమైపోయాయి. మే 1 లోపు అన్ని జట్లు తమ టీమ్ లను ప్రకటించాల్సి ఉంది. అయితే టి20 వరల్డ్ కప్ లో పాల్గొనే టీమిండియా జట్టును ఈనెల 28న బీసీసీఐ (Bcci) ప్రకటించే అవకాశం ఉంది. టి20 వరల్డ్ కప్ సందర్భంగా స్టార్ స్పోర్ట్స్ ఛానల్ టీమిండియా పై ఒక ప్రోమో వీడియో (Promo Video)ను రూపొందించింది. తాజాగా ఆ ప్రోమో వీడియోను స్టార్ స్పోర్ట్స్ ఛానల్ (Star Sports) రిలీజ్ చేసింది. ఇప్పుడా వీడియో సోషల్ మీడియాలో ఒక ఊపు ఊపేస్తోంది .

Team India Promo

గూస్​ బంప్స్​ తెప్పిస్తున్న బ్యాగ్రౌండ్​ మ్యూజిక్​...

టి20 వరల్డ్ కప్ కు భారత్ సిద్ధం అంటూ ప్రోమోస్ స్టార్ట్ అయింది. విరాట్ కోహ్లీ బ్యాటింగ్, రోహిత్ శర్మ హిట్టింగ్, సూర్య కుమార్ యాదవ్ ఫీట్స్, రవీంద్ర జడేజా బౌలింగ్, హార్దిక్ పాండ్యా బౌలింగ్ యాక్షన్ లను కలిపి ఈ వీడియోలో చూపించారు. ఈ వీడియో క్లిప్పింగ్స్ కు జాతీయ గేయం వందేమాతరం ను యాడ్ చేశారు. అంతే ఒక్కసారిగా రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి. వీడియో చివరలో కింగ్ కోహ్లీ సెల్యూట్ చేస్తున్న విజువల్ అయితే అభిమానుల్లో మంచి జోష్ నింపుతోంది. ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ ను షేక్ చేసేస్తోంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఇంటర్నెట్​  ను షేక్​ చేస్తున్ టీమిండియా ప్రోమో వీడియో