సచిన్ టెండుల్కర్ అంతర్జాతీయ సెంచరీలపై ఓ లుక్కేయండి
రెండు దశాబ్దాలకు పైగా క్రికెట్ ప్రపంచాన్ని శాసించిన సచిన్ టెండుల్కర్.. క్రికెట్ రిటైర్మెంట్ ఇచ్చి అప్పుడే పదేళ్లు అయిపోయింది. ఇప్పటికీ సచిన్ క్రియేట్ చేసిన ఎన్నో రికార్డులను ఎవ్వరూ టచ్ చేయలేకపోయారు. ఏ ప్లేయర్ కూడా కలలో ఊహించిన పరుగులు, మ్యాచ్ లు, బౌండరీలు, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ లను సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్లో వంద సెంచరీలను బాది ఎవరికి అందనంత ఎత్తులో ఉన్నాడు. తన 24 ఏళ్ల కెరీర్లో సచిన్ 200 టెస్టులు, 463 వన్డేలు ఆడాడు. ఈ రెండు ఫార్మాట్లో కలిపి 34, 347 పరుగులు చేశాడు. టెస్టుల్లో 51 సెంచరీలు, వన్డేల్లో 49 సెంచరీలను బాదాడు.
1990లో మొదటి టెస్టు సెంచరీ సాధించిన సచిన్
1990లో ఇంగ్లండ్ పై సచిన్ తొలి టెస్ట్ సెంచరీని పూర్తి చేశాడు. వన్డేలో తొలి సెంచరీని ఆస్ట్రేలియాపై 1994, సెప్టెంబర్ 27న చేశాడు 1992 ఆస్ట్రేలియాపై రెండు టెస్టు సెంచరీలు, సౌతాఫ్రికాపై ఒక సెంచరీ, 1993లో ఇంగ్లాండ్, శ్రీలంకపై ఒక సెంచరీ, 1994లో శ్రీలంక, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లపై తలా ఓ సెంచరీ వెస్టిండీస్ పై ఒక సెంచరీని నమోదు చేశాడు. 1995లో శ్రీలంకపై ఒక సెంచరీ, 1996లో కెన్యా, సౌతాఫ్రికాపై ఓ సెంచరీ, శ్రీలంక, ఇంగ్లాండ్, పాకిస్తాన్ తలా రెండు సెంచరీలను బాదాడు. 1997లో సౌతాఫ్రికా, జింబాబ్వే, న్యూజిలాండ్ ఓ సెంచరీ, శ్రీలంకపై మూడు సెంచరీలను బాదాడు.
1998లో ఆస్ట్రేలియాపై ఆరు సెంచరీలు కొట్టిన సచిన్
1998లో ఆస్ట్రేలియాపై 6, కెన్యా, జింబాబ్వే 3, శ్రీలంకపై 1, న్యూజిలాండ్ పై 1, 1999లో శ్రీలంకపై రెండు, న్యూజిలాండ్ మూడు, పాకిస్తాన్, కెన్యా, ఆస్ట్రేలియా తలా ఒకటి, 2000లో జింబాబ్వే 3, సౌతాఫ్రికా, శ్రీలంక తలా సెంచరీని కొట్టాడు. 2001లో ఆస్ట్రేలియాపై 2, వెస్టిండీస్‌పై 1, సౌతాఫ్రికా పై 2, కెన్యాపై 1, ఇంగ్లాండ్ పై 1, 2002లో జింబాబ్వేపై 1, వెస్టిండీస్ పై 1, ఇంగ్లాండ్ పై 2, శ్రీలంకపై 1, వెస్టిండీస్ పై 1, నబీబీయా 1తో ఓ సెంచరీ, 2003లో ఆస్ట్రేలియాపై 2, న్యూజిలాండ్ పై1, పాకిస్థాన్ పై 2 సెంచరీలు చేశాడు. 2004లో బంగ్లాదేశ్ పై 1, 2005లో పాకిస్తాన్ పై 1, శ్రీలంకపై ఒక సెంచరీ సాధించాడు.
బంగ్లాదేశ్ పై చివరి సెంచరీ సాధించిన సచిన్
2006లో పాకిస్తాన్ పై 1, వెస్టిండీస్ 1, 2007లో వెస్టిండీస్ పై 1, బంగ్లాదేశ్ పై 2 రెండు సెంచరీలను నమోదు చేశాడు. 2008లో ఆస్ట్రేలియాపై 4, ఇంగ్లాండ్ పై 1, 2009లో న్యూజిలాండ్ పై 2, శ్రీలంకపై 1, ఆస్ట్రేలియాపై 1, శ్రీలంకపై 1, 2010లో బంగ్లాదేశ్ పై 2, సౌతాఫ్రికా 4, శ్రీలంకపై 1, ఆస్ట్రేలియా 1, 2011లో సౌతాఫ్రికాపై 2, ఇంగ్లాండ్ పై 1, బంగ్లాదేశ్ పై 1 సెంచరీని సాధించాడు.