Virat Kohli: రోహిత్ శర్మ కెప్టెన్సీలో విరాట్ కోహ్లి ఆటతీరుపై ఓ లుక్కేయండి
ఈ వార్తాకథనం ఏంటి
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
ఇప్పటికే టీమిండియా జట్టుకు ఎన్నో మరుపురాని విజయాలను అందించాడు.
నిలకడగా రాణిస్తూ ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాటర్‌గా ఎదిగాడు.
తాజాగా విరాట్ కోహ్లీ టీ20లకు గుడ్ బై చెప్పాడు. ఇక భారత్ తరుఫున వన్డే, టెస్టులకు మాత్రమే ప్రాతినిధ్యం వహించనున్నాడు.
ఇక టీమిండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ కెప్టెన్సీలో కోహ్లీ ఆటతీరుపై ఓ లుక్కేద్దాం.
Details
రోహిత్ కెప్టెన్సీలో 29 టీ20 మ్యాచులాడిన కోహ్లీ
రోహిత్ కెప్టెన్సీలో విరాట్ కోహ్లీ 29 టీ20 అంతర్జాతీయ మ్యాచులను ఆడాడు.
అందులో 34.95 సగటుతో 839 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు (82*) పరుగులు చేశారు.
అదే విధంగా తొమ్మది హాఫ్ సెంచరీలను బాదాడు.
భారత్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని నాయకత్వంలో 42 టీ20 అంతర్జాతీయ మ్యాచులను ఆడాడు. 57.75 సగటుతో 1,617 పరుగులు రాబట్టాడు.
కెప్టెన్‌గా కోహ్లీ 50 మ్యాచ్‌ల్లో 47.57 సగటుతో 1,570 పరుగులు చేశాడు.
Details
ధోని నాయకత్వంలో అత్యధిక వన్డేలు ఆడిన కోహ్లీ
టీ20 ప్రపంచ కప్‌లో 8 మ్యాచ్‌లాడిన కోహ్లీ 18.87 సగటుతో 151 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో కోహ్లీ ఒక హాఫ్ సెంచరీ సాధించాడు.
ఇక రోహిత్ నేతృత్వంలో కోహ్లీ 33 వన్డేలు ఆడాడు, 57.84 సగటుతో 1,446 పరుగులు సాధించాడు. ఇందులో 8 సెంచరీలు ఉన్నాయి.
ధోనీ నాయకత్వంలో, కోహ్లీ అత్యధికంగా 138 వన్డే మ్యాచులు ఆడాడు. 50.91 సగటుతో 5,703 పరుగులు చేశాడు. ఇందులో 19 సెంచరీలు సాధించాడు.
Details
రెండో ఆటగాడిగా చరిత్రకెక్కిన కోహ్లీ
మరోవైపు కెప్టెన్‌గా కోహ్లీ 95 వన్డేలు ఆడాడు. కోహ్లీ కెప్టెన్సీలో 21 వన్డే సెంచరీలు సాధించాడు.
కెప్టెన్‌గా వన్డేల్లో అత్యధిక సెంచరీలు సాధించిన రెండో ఆటగాడు కోహ్లీ చరిత్రకెక్కాడు.
అతని కంటే ముందు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ (22 సెంచరీలు) సాధించాడు.
రోహిత్ శర్మ నేతృత్వంలో కోహ్లీ 11 టెస్టు మ్యాచ్‌లు ఆడి 810 పరుగులు చేశాడు.
ధోనీ కెప్టెన్సీలో 30 టెస్టులు ఆడి, 40.00 సగటుతో 1,960 పరుగులు చేశాడు.
టెస్టుల్లో తన సొంత కెప్టెన్సీలో కోహ్లీ 68 టెస్టులు ఆడి 54.80 సగటుతో 20 సెంచరీలు చేశాడు.