LOADING...
Tazmin Brits: టాజ్మిన్ బ్రిట్స్ అరుదైన ఘనత.. స్మృతి మంధాన వరల్డ్ రికార్డు బ్రేక్
టాజ్మిన్ బ్రిట్స్ అరుదైన ఘనత.. స్మృతి మంధాన వరల్డ్ రికార్డు బ్రేక్

Tazmin Brits: టాజ్మిన్ బ్రిట్స్ అరుదైన ఘనత.. స్మృతి మంధాన వరల్డ్ రికార్డు బ్రేక్

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 07, 2025
11:57 am

ఈ వార్తాకథనం ఏంటి

దక్షిణాఫ్రికా బ్యాటర్ టాజ్మిన్ బ్రిట్స్ మాహిళల వన్డే క్రికెట్‌లో అరుదైన ఘనత సాధించింది. ఓ క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక సెంచరీలు బాదిన ప్లేయర్‌గా చరిత్రలో నిలిచింది. 2025 మహిళల వన్డే ప్రపంచకప్‌లో సోమవారం న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో బ్రిట్స్ 101 పరుగులు (89 బంతుల్లో,15 ఫోర్లు, 1 సిక్స్) చేయడం ద్వారా ఈ ఘనత అందుకుంది. ఈ ఘటనా ద్వారా ఆమె టీమిండియా స్టార్ స్మృతి మంధాన రికార్డును కూడా బ్రేక్ చేసింది. మంధాన్ 2024, 2025లో ఒక్కో సంవత్సరంలో నాలుగు సెంచరీలు మాత్రమే చేయగా, బ్రిట్స్ ఈ ఏడాది మొత్తం 5 సెంచరీలు చేయడం గమనార్హం. అదనంగా ఈ ఐదు సెంచరీల్లో నాలుగు చివరి ఐదు వన్డేల్లో మాత్రమే వచ్చాయి.

Details

మహిళల క్రికెట్‌లో ఓ క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక సెంచరీలు

టాజ్మిన్ బ్రిట్స్ (దక్షిణాఫ్రికా) - 5 సెంచరీలు (2025) స్మృతి మంధాన (భారత్) - 4 సెంచరీలు (2025) స్మృతి మంధాన (భారత్) - 4 సెంచరీలు (2024) అత్యంత వేగంగా ఏడు శతకాలు టాజ్మిన్ బ్రిట్స్ మరో రికార్డును కూడా సొంతం చేసుకుంది. వన్డేల్లో ఏడు శతకాలు అత్యంత వేగంగా (ఇన్నింగ్స్‌లో) పూర్తిచేసిన ప్లేయర్‌గా ఆమె రికార్డు సృష్టించింది. గతంలో ఈ రికార్డు ఆసీస్ దిగ్గజం మెగ్ లాన్నింగ్ వద్ద ఉండేది (44 ఇన్నింగ్స్‌లో ఏడు శతకాలు). బ్రిట్స్ కేవలం 41 ఇన్నింగ్స్‌లో ఇదే ఘనత సాధించింది.

Details

వన్డేల్లో ఏడు శతకాలు వేగంగా పూర్తి చేసిన ప్లేయర్లు 

టాజ్మిన్ బ్రిట్స్ - 41 ఇన్నింగ్స్‌లు మెగ్ లాన్నింగ్ - 44 ఇన్నింగ్స్‌లు టామీ బ్యూమాంట్ - 62 ఇన్నింగ్స్‌లు సుజీ బేట్స్ - 81 ఇన్నింగ్స్‌లు కరెన్ రోల్టన్ / హేలే మాథ్యూస్ - 83 ఇన్నింగ్స్‌లు స్మృతి మంధాన్ - 84 ఇన్నింగ్స్‌లు

Details

మ్యాచ్ విశ్లేషణ

మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు 47.5 ఓవర్లలో 231 పరుగులకే ఆలౌటైంది. కివీస్ కేప్టెన్ సోఫీ డివైన్ (85; 98 బంతుల్లో 9 ఫోర్లు) హాఫ్ సెంచరీ, బ్రూక్ హాలిడే (45) రాణించారు. సపారీ బౌలర్లలో నాన్కులులేకో మ్లాబా నాలుగు వికెట్లు తీశారు. తరువాత టాజ్మిన్ బ్రిట్స్ (101) సెంచరీ బాదడంతో, సునే లూస్ (83 నాటౌట్) హాఫ్ సెంచరీ చేశారు. టార్గెట్ 232 పరుగులుగా కాగా, న్యూజిలాండ్ 40.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని సాధించింది.