LOADING...
IND vs SA: నవంబర్ 22న ఇండియా-సౌతాఫ్రికా టెస్టు.. గువాహటిలో కొత్త సంప్రదాయం!
నవంబర్ 22న ఇండియా-సౌతాఫ్రికా టెస్టు.. గువాహటిలో కొత్త సంప్రదాయం!

IND vs SA: నవంబర్ 22న ఇండియా-సౌతాఫ్రికా టెస్టు.. గువాహటిలో కొత్త సంప్రదాయం!

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 30, 2025
03:43 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత్‌ వచ్చే నెలలో దక్షిణాఫ్రికాతో రెండు టెస్టుల సిరీస్‌ ఆడనుంది. నవంబర్ 14న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో మొదటి టెస్టు ప్రారంభం కానుంది. ఆ తర్వాత నవంబర్ 22న గువాహటిలో రెండో టెస్టులో ఇరు జట్లు తలపడతాయి. అయితే ఈ సారి గువాహటి వేదికగా టెస్టు మ్యాచ్‌ ఒక కొత్త సంప్రదాయానికి నాంది పలకనుంది. ఈ పద్ధతిని కేవలం అక్కడికే పరిమితం చేస్తారా? లేక భవిష్యత్తులో ఇతర సిరీస్‌ల్లో కూడా అమలు చేస్తారా? అనేది స్పష్టత రావాల్సి ఉంది. కానీ గువాహటిలో జరగబోయే ఐదు రోజుల మ్యాచ్‌ మాత్రం కొత్త పద్ధతిలోనే సాగనుంది.

వివరాలు 

ఈ సంప్రదయానికి కారణం అక్కడ వాతావరణమే.

ఇప్పటివరకు టెస్టు మ్యాచ్‌లు సాధారణంగా రోజుకు 90 ఓవర్ల చొప్పున మూడు సెషన్‌లుగా కొనసాగుతాయి. తొలి సెషన్‌ పూర్తయ్యాక లంచ్‌ విరామం ఇస్తారు. రెండో సెషన్‌ తర్వాత టీ బ్రేక్‌ ఇస్తారు. చివరి సెషన్‌ ముగిసిన తర్వాత ఆ రోజు ఆట పూర్తయినట్లే. అయితే ఈసారి గువాహటిలో ఆ క్రమం మారనుంది. అక్కడ మొదట టీ బ్రేక్‌ ఇవ్వనున్నారు, ఆ తర్వాత లంచ్‌ బ్రేక్‌ ఉంటుంది. దీనికి ప్రధాన కారణం గువాహటి వాతావరణ పరిస్థితులే. అక్కడ సూర్యోదయం తక్కువ సమయానికే జరుగుతుండగా, సూర్యాస్తమయం కూడా ముందుగానే అవుతుంది. ఈ కారణంగా రోజంతా అందుబాటులో ఉండే వెలుతురు సమయాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ మార్పు తీసుకువచ్చినట్లు క్రికెట్‌ వర్గాలు వెల్లడించాయి.

వివరాలు 

మూడు సెషన్ల టైమింగ్‌ ఇలా.. 

తొలి సెషన్: 9 గంటల నుంచి 11 గంటల వరకు టీ బ్రేక్‌: 11 గంటల నుంచి 11.20 గంటల వరకు రెండో సెషన్: 11.20 గంటల నుంచి 1.20 గంటల వరకు లంచ్‌ బ్రేక్‌: 1.20 గంటల నుంచి 2 గంటల వరకు మూడో సెషన్: 2 గంటల నుంచి 4 గంటల వరకు