Page Loader
భారత్- పాక్ మ్యాచ్‌పై ఉత్కంఠ.. రోహిత్‌తో కలిసి టీమిండియా ఇన్నింగ్స్ ప్రారంభించేది ఎవరు?
రోహిత్ తో కలిసి టీమిండియా ఇన్నింగ్స్ ప్రారంభించేది ఎవరు

భారత్- పాక్ మ్యాచ్‌పై ఉత్కంఠ.. రోహిత్‌తో కలిసి టీమిండియా ఇన్నింగ్స్ ప్రారంభించేది ఎవరు?

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Sep 02, 2023
01:14 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆసియా కప్‌ లో భాగంగా నేడు పాకిస్థాన్-టీమిండియా తలపడనున్నాయి. ఈ మేరకు ఇప్పటికే జట్టు కసరత్తులు పూర్తయ్యాయి. మధ్యాహ్నం 3 గంటలకు భారత్ పాక్ మ్యాచ్ ప్రారంభం కానుంది. ప్రస్తుతం టీమిండియా బ్యాటింగ్‌ ఆర్డర్‌పైనే దృష్టి పెట్టింది. కేఎల్‌ రాహుల్‌, శ్రేయస్‌ అయ్యర్‌ తాజాగా జట్టులోకి వచ్చారు. సంజూశాంసన్‌ను కేఎల్‌కు సపోర్ట్ ప్లేయర్‌గా ఎంపిక చేశారు. తొలి 2మ్యాచ్‌లకు కేఎల్ సిద్ధంగా లేడని టీమ్ తెలిపింది. ఈ క్రమంలోనే ఇషాన్‌ బ్యాట్ పట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ఇషాన్‌ను ఓపెనర్‌గా పంపాలా లేక మిడిలార్డర్‌లో ఆడించాలా అన్న అంశంపై జట్టు తర్జనభర్జన పడుతోంది. వెస్టిండీస్‌తో జరిగిన వన్డేలో గిల్‌తో కలిసి ఇషాన్‌ ఓపెనర్‌గా వచ్చాడు. వరుసగా 3మ్యాచ్‌ల్లో అర్ధ శతకాలు బాదాడు.

DETAILS

భారత్ జట్టు అంచనా

మొత్తం 184 పరుగులతో ఇషాన్ కిషన్ కరేబియన్ గడ్డపై అద్భుతంగా రాణించాడు. మరోవైపు ఇవాళ కెప్టెన్ రోహిత్‌ శర్మతో పాటు అతడికి జోడీగా ఆడేది ఎవరో తేలాల్సి ఉంది. పాకిస్థాన్ ఇప్పటికే తన తుది జట్టును ప్రకటించింది. మొదటి మ్యాచ్‌లో పసికూన నేపాల్‌పై పాక్ సూపర్ విక్టరీ సాధించింది. ఈ మేరకు మరింత ఆత్మవిశ్వాసంతో దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలోనే చిరకాల ప్రత్యర్థిని ఓడించాలంటే, పక్కా ప్రణాళికలను టీమిండియా అమలు చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే బ్యాటింగ్ బలాన్ని మరోసారి నిరూపించుకోవాల్సి ఉంది. భారత్‌ (అంచనా) : రోహిత్‌ (కెప్టెన్‌), శుభ్‌మన్‌ గిల్‌, కోహ్లి, శ్రేయస్‌ అయ్యర్‌, ఇషాన్‌ కిషన్‌ (వికెట్‌ కీపర్‌), హార్దిక్‌, జడేజా, కుల్‌దీప్‌, సిరాజ్‌/ అక్షర్ పటేల్, షమీ, బుమ్రా