Asia Cup : ఆసియా కప్‌లో టీమిండియాకు మెరుగైన రికార్డు.. పాకిస్థాన్ ప్లేస్ ఎక్కడంటే..?
ఈ వార్తాకథనం ఏంటి
భారత జట్టు ఐర్లాండ్ పర్యటనలో టీ20 సిరీస్‌ను కైవసం చేసుకుంది. ప్రస్తుతం క్రికెట్ అభిమానులు ఆసియా కప్ కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ టోర్నీలో భాగంగా సెప్టెంబర్ 2న కాండీ వేదికగా పాక్, భారత్ జట్లు తలపడనున్నాయి.
ఈ హై ఓల్టోజ్ మ్యాచ్‌ను తిలకించడానికి క్రికెట్ అభిమానులు అతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ సారి ఆసియాకప్ వన్డే ఫార్మాట్ లో జరగనుంది. ఈ ఫార్మాట్లో 4 ఏళ్ల తర్వాత దయాదుల పోరు జరగనుంది.
భారత్-పాక్ జట్లు 2019 వన్డే ప్రపంచ కప్‌లో తలపడ్డాయి. ఈ మ్యాచులో భారత్ 89 పరుగుల తేడాతో గెలుపొందింది.
ఈ ఏడాది ఆసియాకప్‌తో పాటు వన్డే ప్రపంచకప్ జరగనుంది. దీంతో భారత్-పాక్ జట్లు నాలుగుసార్లు తలపడే అవకాశం ఉంది.
Details
అత్యధికసార్లు ట్రోఫిని గెలుచుకున్న జట్టుగా భారత్
ఆసియా కప్ వన్డే ఫార్మాట్లో భారత్-పాకిస్థాన్ 13 మ్యాచుల్లో తలపడ్డాయి. ఇందులో భారత్ 7 మ్యాచుల్లో విజయం సాధించగా, పాక్ ఐదు మ్యాచుల్లో గెలుపొందింది. ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. మొత్తం మీద ఆసియా కప్ లో భారత్ 49 మ్యాచులు ఆడి 31 మ్యాచుల్లో విజయం సాధించింది.
అదే విధంగా పాకిస్థాన్ 45 మ్యాచుల్లో 26 విజయాలను నమోదు చేసింది. ఆసియా కప్‌లో భారత్ విజయ శాతం 65.62గా ఉంది.
ఆసియా కప్‌లో అత్యధికంగా భారత్ 7 సార్లు ట్రోఫీని సొంతం చేసుకోగా, పాకిస్థాన్ 2000, 2012లో ఛాంపియన్‌గా అవతరించింది.
శ్రీలంక ఆరుసార్లు ట్రోఫీని నెగ్గి రెండోస్థానంలో ఉంది.