
England vs India: 'ఎడ్జ్‌బాస్టన్' పేరు వింటేనే గడగడలాడుతున్న టీమిండియా!
ఈ వార్తాకథనం ఏంటి
లీడ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టులో టీమిండియా గెలుపు అవకాశాలను చేజార్చుకుంది. మ్యాచ్‌లో తొలినాలుగు రోజులు ఆధిపత్యం చలాయించినా.. చివరికి భారత్ ఓటమి పాలైంది. మంచి స్కోరు చేసినప్పటికీ, బ్యాటర్లు, బౌలర్లు విఫలమైన నేపథ్యంలో భారత్‌కు విజయం లభించలేదు. బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్‌లో ఇంగ్లాండ్ ప్రధాన బ్యాటర్లు అద్భుతంగా రాణించడంతో భారత బౌలర్లకు ఎదురుదెబ్బ తగిలింది.
Details
ఎడ్జ్‌బాస్టన్‌లో భారత్ పేలవ రికార్డు
రెండో టెస్టు ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరగనున్న నేపథ్యంలో భారత్‌కు ఆ మైదానం కలసిరాలేదు. ఇప్పటివరకు ఆ వేదికపై ఎనిమిది టెస్టులు ఆడిన భారత్.. ఏ ఒక్క మ్యాచ్‌లోనూ గెలవలేదు. ఒక్క మ్యాచ్‌ను మాత్రమే డ్రా చేసుకుంది. 2022లో అక్కడే జరిగిన టెస్టులో భారత్ ఇంగ్లాండ్ చేతిలో 7 వికెట్ల తేడాతో ఓడింది. ఆ మ్యాచ్‌లో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 416 పరుగులు చేయగా.. ఇంగ్లాండ్ 284 పరుగులకు ఆలౌటైంది. భారత్ 132 పరుగుల ఆధిక్యంలో ఉన్నా.. రెండో ఇన్నింగ్స్‌లో 245 పరుగులకే కుప్పకూలింది. ఆ తరువాత ఇంగ్లాండ్ 378 పరుగుల లక్ష్యాన్ని కేవలం 3 వికెట్లను మాత్రమే కోల్పోయి ఛేదించింది. జో రూట్, బెయిర్‌స్టో అజేయ శతకాలతో జట్టును విజయతీరాలకు చేర్చారు.
Details
రెండో టెస్టుకు భారత జట్టులో మార్పులు తథ్యం
రెండో టెస్టులో భారత తుది జట్టులో మార్పులు జరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ముఖ్యంగా మణికట్టు స్పిన్నర్ కుల్‌దీప్ యాదవ్‌ను జట్టులోకి తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు సహాయ కోచ్ టెన్ డస్కాటే తెలిపారు. ఇప్పటికే జడేజా తుది జట్టులో ఉండగా.. అతడికి తోడుగా కుల్‌దీప్ ఆడే అవకాశముంది. వాషింగ్టన్ సుందర్ కూడా అందుబాటులో ఉన్నప్పటికీ, బంతిని ఎక్కువగా తిప్పగలగడమే కుల్‌దీప్‌కు ప్లస్ పాయింట్. జస్పిత్ బుమ్రా ఆటకు సంబంధించి ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని డస్కాటే వెల్లడించారు. బుమ్రాకు మూడు టెస్టులకే పరిమితం చేసే దిశగా యాజమాన్యం ప్లాన్ చేస్తున్న నేపథ్యంలో రెండో టెస్టుకు అతడికి విశ్రాంతినిచ్చే అవకాశముంది. బుమ్రా ఆడకపోతే.. కుల్‌దీప్ అతని స్థానాన్ని భర్తీ చేసే అవకాశం ఉంది.
Details
ఇంగ్లండ్ మాత్రం యథాతథంగా
ఇంగ్లాండ్ జట్టు ఇప్పటికే తమ తుది జట్టును ప్రకటించింది. తొలి టెస్టు ప్రారంభానికి రెండు రోజుల ముందే జట్టును ప్రకటించిన ఈ జట్టు.. రెండో టెస్టుకు కూడా అదే ధోరణి కొనసాగించింది. విజయవంతమైన మొదటి టెస్టు జట్టులో ఎలాంటి మార్పులు చేయకుండా, అదే టీమ్‌ను కొనసాగించనున్నారు. జోఫ్రా ఆర్చర్‌ను జట్టులోకి తీసుకున్నా, అతడికి ప్రాధాన్యత ఇవ్వలేదు. కుటుంబంలో తలెత్తిన అత్యవసర పరిస్థితుల కారణంగా ఆర్చర్ సోమవారం ప్రాక్టీస్ మిస్ అయ్యాడు. మంగళవారం జట్టుతో తిరిగి కలవనున్నాడు. ఇంగ్లాండ్ తుది జట్టు స్టోక్స్ (కెప్టెన్), క్రాలీ, డకెట్, పోప్, రూట్, బ్రూక్, జేమీ స్మిత్, వోక్స్,కార్స్, టంగ్,బషీర్ లీడ్స్ వేదికపై చరిత్రను తిరగరాయలేకపోయిన భారత్, ఇప్పుడు తానెప్పుడూ గెలవని ఎడ్జ్‌బాస్టన్ వేదికపై సవాల్‌ను ఎదుర్కొనబోతోంది