
Asia Cup: ఆసియా కప్ టైటిల్ రేసులో టీమిండియానే టాప్ ఫేవరెట్ : మహరూఫ్
ఈ వార్తాకథనం ఏంటి
శ్రీలంక మాజీ క్రికెటర్ ఫర్వేజ్ మహరూఫ్ (Farveez Maharoof) ప్రకారం రాబోయే ఆసియా కప్‌లో (Asia Cup) టీమ్‌ఇండియా (Team India) ప్రధాన ఫేవరెట్. అయితే అదే సమయంలో టీ20 క్రికెట్‌లో ఏదైనా జరగవచ్చని, శ్రీలంక, బంగ్లాదేశ్‌లకు కూడా గెలిచే అవకాశముందని ఆయన అభిప్రాయపడ్డాడు. ఇప్పటివరకు శ్రీలంక మొత్తం ఆరు సార్లు ఆసియా కప్‌ను కైవసం చేసుకోగా, బంగ్లాదేశ్ 2012, 2016, 2018లో ఫైనల్స్‌కు చేరినా టైటిల్‌ను మాత్రం అందుకోలేకపోయింది. టీమిండియా బలమైన జట్టు. కాబట్టి టైటిల్ గెలిచే అవకాశం ఎక్కువ. కానీ ఇది టీ20. ఇక్కడ ఎవరైనా ఛాంపియన్‌గా నిలవొచ్చని మహరూఫ్ ఓ ఇంటర్వ్యూలో అన్నాడు.
Details
ఐపీఎల్ వల్ల భారత జట్టుకు లాభం
భారత జట్టు బలాలపై మాట్లాడుతూ, అన్ని ఫార్మాట్లలోనూ భారత్ దగ్గర విస్తారమైన ఆటగాళ్ల జాబితా ఉందని పేర్కొన్నాడు. రోహిత్ శర్మ (Rohit Sharma) టీ20లకు రిటైర్ అయ్యినా, అతని స్థానాన్ని భర్తీ చేసే క్రికెటర్లు చాలామంది ఉన్నారని వివరించాడు. ముఖ్యంగా ఐపీఎల్ (IPL) వల్ల భారత జట్టుకు చాలా లాభం జరుగుతోందని అన్నారు. యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) గురించి మాట్లాడుతూ, "అతడి బ్యాటింగ్ చూడటం నాకు ఇష్టం. జైస్వాల్ పెద్ద స్కోర్లు చేసినప్పుడు భారత్ విజయం సాధించే అవకాశం ఎక్కువ. ప్రస్తుతం అతడు జట్టులో లేనప్పటికీ, త్వరలోనే టీ20 జట్టులో స్థానం దక్కించుకుంటాడని అభిప్రాయపడ్డాడు.
Details
సెప్టెంబర్ 9 నుంచి ఆసియా కప్ ప్రారంభం
ఇక జస్పిత్ బుమ్రా బౌలింగ్ యాక్షన్ యూనిక్ అని, ఇప్పుడు మరింత మెరుగైందని తెలిపారు. ఇన్‌స్వింగ్, అవుట్ స్వింగ్ రెండూ చేయగల బౌలర్. ప్రస్తుత బ్యాటర్లలో 90 శాతం మంది అతడే అత్యంత కఠినమైన బౌలర్ అని చెబుతారు. కానీ తరచూ గాయాల పాలవడం దురదృష్టకరం. ఫాస్ట్ బౌలర్లు ప్రతిసారీ బంతిని వదులుతుంటే తమ శరీర బరువుకంటే మూడింతల ఒత్తిడి వెన్ను, మోకాళ్లు, మడమలపై పడుతుంది. అందుకే వారిలో గాయాలు ఎక్కువ అని ఆయన వివరించాడు. యూఏఈ వేదికగా సెప్టెంబర్ 9 నుంచి ఆసియా కప్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ అఫ్గానిస్థాన్-హాంకాంగ్ మధ్య జరుగుతుండగా, సెప్టెంబర్ 10న టీమ్‌ఇండియా యూఏఈతో తలపడనుంది.