
ENGW vs INDW: చరిత్రను తిరగరాసిన టీమిండియా.. ఇంగ్లండ్‌పై 3-1తో సిరీస్ విజయం
ఈ వార్తాకథనం ఏంటి
భారత మహిళల క్రికెట్ జట్టు చారిత్రక విజయాన్ని సాధించింది. ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా ఇంగ్లాండ్‌పై నాలుగో మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో విజయం సాధించి, ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే 3-1 తేడాతో సిరీస్‌ను గెలుచుకుంది. ఇప్పటివరకు ఇంగ్లాండ్‌తో జరిగిన అన్ని ద్వైపాక్షిక సిరీస్‌లను ఆ జట్టే గెలిచింది. అయితే ఈసారి టీమిండియా మైలురాయిగా నిలిచిన విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. నాలుగో టీ20లో ఇంగ్లాండ్ తొలుత బ్యాటింగ్‌కు దిగగా, భారత బౌలర్ల అద్భుత ప్రదర్శనతో 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 126 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇంగ్లాండ్ తరఫున సోఫియా డంక్లీ (22) అత్యధిక స్కోర్ చేసింది.
Details
రాణించిన భారత ఓపెనర్లు
భారత బౌలింగ్‌లో రాధా యాదవ్, శ్రీ చరణి చెరో రెండు వికెట్లు తీయగా, అమన్‌జోత్ కౌర్, దీప్తి శర్మ చెరో వికెట్ దక్కించుకున్నారు. లక్ష్య ఛేదనలో భారత జట్టు ఆత్మవిశ్వాసంగా ఆడింది. ఓపెనర్లు స్మృతి మంధాన (32), షఫాలీ వర్మ (31) శుభారంభం ఇచ్చారు. తర్వాత హర్మన్‌ప్రీత్ కౌర్ (26) జెమీమా రోడ్రిగ్స్ (24 నాటౌట్) గెలుపును సునాయాసం చేశారు. టీమ్‌ఇండియా 17 ఓవర్లలోనే నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. ఇందుకు ముందు, భారత్ తొలి రెండు టీ20ల్లో విజయం సాధించి, మూడో మ్యాచ్‌లో పరాజయం పాలైంది. కానీ నాలుగో మ్యాచ్‌లో తిరిగి పుంజుకుని సిరీస్‌ను కైవసం చేసుకుంది.
Details
ఈ నెల 12న ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఐదో టీ20
ఈ విజయంతో 2006లో డర్బీలో ఇంగ్లాండ్‌పై భారత్ సాధించిన ఏకైక విజయానంతరం మరోమారు ఇంగ్లాండ్‌ను టాప్ ఫార్మాట్‌లో చిత్తు చేసిన ఘనతను అందుకుంది. ఈ నెల 12న ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఐదో టీ20 మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే సిరీస్‌ను గెలిచిన భారత్, చివరి మ్యాచ్‌ను కూడా విజయంతో ముగించాలని భావిస్తోంది.