3rd ODI:ఇలాగైతే ఆస్ట్రేలియాకు వైట్‌వాష్ తప్పదు.. భారత జట్టులోకి సీనియర్ ప్లేయర్ల ఎంట్రీ!
ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి రెండు వన్డేలకు భారత స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, హార్ధిక్ పాండ్యాలకు విశ్రాంతినిచ్చారు. ఈ ముగ్గురు లేకుండానే కేఎల్ రాహుల్ నేతృత్వంలో భారత జట్టు రెండు వన్డేల్లో గెలుపొంది, సిరీస్‌ను సొంతం చేసుకుంది. ఇక ఆగస్టు 27న జరిగే మూడో వన్డేలో సీనియర్ ఆటగాళ్లు ఎంట్రీ ఇవ్వనున్నారు. దీంతో టీమిండియా సిరీస్ ను వైట్ వాష్ చేయాలని చూస్తోంది. మరోవైపు ఆస్ట్రేలియా చివరి వన్డేలో నెగ్గి పరువు నిలబెట్టుకోవాలని భావిస్తోంది. రాజ్‌కోట్‌లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో బుధవారం భారత్, ఆసీస్ తలపడనున్నాయి. ఇక్కడ ట్రాక్ బ్యాటర్లకు అనుకూలంగా ఉన్నప్పటికీ, పేసర్లు ప్రారంభంలో మొదట్లో వికెట్లు తీసే అవకాశం ఉంది.
గిల్, శార్దుల్ ఠాకూర్ కు విశ్రాంతి
ఇప్పటి వరకు 148 వన్డేల్లో ఇరు జట్లు తలపడ్డాయి. అందులో 56 మ్యాచ్‌ల్లో భారత్ విజయం సాధించగా, ఆస్ట్రేలియా 82 వన్డేల్లో విజయం సాధించింది. మరో 10 మ్యాచ్‌లు రద్దయ్యాయి. ఈ ఏడాది ప్రారంభంలో ఆస్ట్రేలియాతో స్వదేశంలో జరిగిన వన్డే సిరీస్‌ను భారత్ 2-1 తేడాతో కోల్పోయిన విషయం తెలిసిందే. చివరి వన్డేలో శుభమాన్ గిల్, శార్దూల్ ఠాకూర్‌లకు విశ్రాంతి ఇవ్వనున్నారు. స్పీడ్‌స్టార్లు జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ కి చివరి వన్డేలో చోటు లభించొచ్చు. ఇక ఆస్ట్రేలియా ఆటగాళ్లు మిచెల్ స్టార్క్, గ్లెన్ మాక్స్‌వెల్ ఫిట్‌గా ఉంటే ఆసీస్ తరుఫున చివరి వన్డేలో ఆడే అవకాశం ఉంటుంది.
ఇరు జట్లలోని ఆటగాళ్లు వీరే!
ఈ మ్యాచ్ స్పోర్ట్స్ 18 ఛానెల్‌లో మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రత్యక్ష ప్రసారం కానుంది. ఆస్ట్రేలియా జట్టు డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, స్టీవ్ స్మిత్, మార్నస్ లాబుషాగ్నే, గ్లెన్ మాక్స్‌వెల్, అలెక్స్ కారీ (WK), మార్కస్ స్టోయినిస్, జోష్ హేజిల్‌వుడ్, పాట్ కమిన్స్ (సి), మిచెల్ స్టార్క్, ఆడమ్ జాంపా భారత జట్టు రోహిత్ శర్మ (సి), ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (డబ్ల్యుకె), సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ.