తదుపరి వార్తా కథనం

IND vs ENG: చివరి టెస్టు మ్యాచులో టీమిండియా సంచలన విజయం.. 6 పరుగుల తేడాతో గెలుపు!
వ్రాసిన వారు
Jayachandra Akuri
Aug 04, 2025
04:36 pm
ఈ వార్తాకథనం ఏంటి
ఇంగ్లండ్‌తో జరిగిన చివరి టెస్టులో భారత్ ఉత్కంఠ భరిత విజయాన్ని అందుకుంది. కేవలం 6 పరుగుల తేడాతో మ్యాచ్‌ను గెలిచి ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-2తో సమం చేసింది. మరో టెస్టు డ్రాగా ముగియడంతో చివరి పోరు విజేతను తేల్చే దశలోకి వచ్చింది. ఈ మ్యాచ్ వివరాల్లోకి వెళ్తే.. మొదటి ఇన్నింగ్స్‌లో భారత జట్టు 224 పరుగులు చేసి ఆలౌటైంది. అనంతరం ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్‌ను 247 పరుగుల వద్ద ముగించింది. రెండో ఇన్నింగ్స్‌లో భారత్ ధాటిగా ఆడి 396 పరుగులు చేసింది. తద్వారా ఇంగ్లాండ్ ముందు 373 పరుగుల విజయలక్ష్యాన్ని ఉంచింది.
Details
ఇంగ్లండ్ బ్యాటర్ల పోరాటం వృథా
అయితే చివరి రోజు ఇంగ్లాండ్ బ్యాటర్లు పోరాడినప్పటికీ... వారు 367 పరుగులకే ఆలౌట్ కావడంతో భారత్ కేవలం ఆరు పరుగుల తేడాతో సంచలన విజయం సాధించింది. ఈ మ్యాచ్ ఫలితంతో సిరీస్ సమంగా ముగిసింది.