NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / ప్రపంచ కప్ జట్టులోకి స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్.. చెప్పకనే చెప్పేసిన కెప్టెన్ రోహిత్
    ప్రపంచ కప్ జట్టులోకి స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్.. చెప్పకనే చెప్పేసిన కెప్టెన్ రోహిత్
    1/2
    క్రీడలు 1 నిమి చదవండి

    ప్రపంచ కప్ జట్టులోకి స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్.. చెప్పకనే చెప్పేసిన కెప్టెన్ రోహిత్

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Sep 19, 2023
    11:52 am
    ప్రపంచ కప్ జట్టులోకి స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్.. చెప్పకనే చెప్పేసిన కెప్టెన్ రోహిత్
    చెప్పకనే చెప్పేసిన కెప్టెన్ రోహిత్

    టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ జట్టులోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనున్నారు. ఈ మేరకు ఆస్ట్రేలియాతో జరగనున్న వన్డే సిరీస్‌కు ఎంపికైన అశ్విన్, వరల్డ్ కప్ సైతం ఆడనున్నట్లు తెలుస్తోంది. గాయపడ్డ అక్షర్ పటేల్ స్థానాన్ని భర్తీ చేయనున్నట్లు సమాచారం. ఇటీవలే భారత కెప్టెన్ రోహిత్ శర్మ చేసిన వ్యాఖ్యలు సైతం దీనికి బలాన్ని అందిస్తున్నాయి. సోమవారం సెలక్షన్ కమిటీ ప్రకటించిన జాబితాలో 37 ఏళ్ల అశ్విన్ తిరిగి జట్టులోకి ప్రవేశించారు. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియాతో మూడు వన్డేలకు ఎంపికయ్యాడు. స్పిన్ ఆల్ రౌండర్‌గా రవిచంద్రన్ అశ్విన్ ఎల్లప్పుడూ జట్టు దృష్టిలో ఉంటారని, ఆసియా కప్ ముగిసిన సందర్భంలో రోహిత్ అన్నారు. ఈ నేపథ్యంలోనే తరచూగా అతడితో టచ్‌లో ఉంటానని చెప్పుకొచ్చారు.

    2/2

    అదే జరిగితే ప్రపంచ కప్ జట్టులోకి రానున్న అశ్విన్ 

    ఇప్పటివరకు 113 వన్డే మ్యాచులు ఆడిన అశ్విన్ 151 వికెట్లు నేలకూల్చాడు. గతేడాది జనవరిలో చివరిసారిగా వన్డే మ్యాచ్ ఆడాడు. బ్యాటింగ్‌లోనూ 86.96 స్ట్రైక్ రేటుతో 707 పరుగులు చేశాడీ స్పిన్ వీరుడు. అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని అశ్విన్‌ను టీమిండియా యజమాన్యం ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీస్‌కు సెలెక్ట్ చేయడం గమనార్హం. అక్షర్ పటేల్ జట్టుకు దూరమైతే, అశ్విన్ వరల్డ్ కప్ జట్టులోనూ చేరడం లాంఛనమే కానుంది. దీంతో కుల్‌దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్‌లు భారత స్పిన్ విభాగాన్ని నిర్వహించనున్నారు. ఈ నెల 22, 24, 27లో భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య వన్డేలు జరగనున్నాయి. మరోవైపు అక్టోబర్ 5 నుంచి వన్డే వరల్డ్ కప్ ప్రారంభం కానుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    రవిచంద్రన్ అశ్విన్
    టీమిండియా

    రవిచంద్రన్ అశ్విన్

    Asia Cup 2023: వారిద్దరి వల్లే పాక్ పటిష్టంగా తయారైంది: రవిచంద్రన్ అశ్విన్ పాకిస్థాన్
    యూవీ, ధోనీ తర్వాత ఆ స్థానాన్ని భర్తీ చేసే ప్లేయర్ అతడే: అశ్విన్ క్రీడలు
    టీమిండియా జట్టులో రవిచంద్రన్ అశ్విన్ తప్పకుండా ఉండాలి : ఎమ్మెస్కే ప్రసాద్ టీమిండియా
    టీమిండియా ఆటగాళ్లతో స్నేహం చేయడం చాలా కష్టం : రవిచంద్రన్ అశ్విన్ టీమిండియా

    టీమిండియా

    WORLD NO.1 INDIA : ప్రపంచకప్‌కు ముందు వన్డేల్లో నెం.1గా భారత్ .. కీలకంగా మారనున్న ఆస్ట్రేలియా సిరీస్   ఆస్ట్రేలియా
    ఆసియా కప్-2023 'ఛాంపియన్'గా అవతరించిన టీమిండియా.. 8వసారి టైటిల్ గెలిచిన భారత్ ఆసియా కప్
    Rohit Sharma:రోహిత్ శర్మ అరుదైన రికార్డు.. తొమ్మిది ఆటగాడిగా గుర్తింపు! రోహిత్ శర్మ
    Asia Cup final : నేడే శ్రీలంకతో మ్యాచ్.. భారత ఆటగాళ్లు చేసిన అత్యత్తుమ ప్రదర్శనలు ఇవే!  ఆసియా కప్
    తదుపరి వార్తా కథనం

    క్రీడలు వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    Sports Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023