Page Loader
కరేబియన్ గడ్డపై టీమిండియా భారీ విజయం.. అశ్విన్ మాయజాలానికి చేతులెత్తేసిన వెస్టిండీస్‌
అశ్విన్ మాయజాలానికి చేతులెత్తేసిన వెస్టిండీస్‌

కరేబియన్ గడ్డపై టీమిండియా భారీ విజయం.. అశ్విన్ మాయజాలానికి చేతులెత్తేసిన వెస్టిండీస్‌

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Jul 15, 2023
10:35 am

ఈ వార్తాకథనం ఏంటి

వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టులో టీమిండియా అదరగొట్టింది. ఈ మేరకు ఇన్నింగ్స్‌, 141 పరుగుల భారీ తేడాతో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ (2023-25) సైకిల్‌లో భారత్‌ అద్భుత ఆరంభాన్ని అందుకుంది. డొమినికా వేదికగా కరేబియన్ గడ్డపై జరిగిన తొలి టెస్టును టీమిండియా సూపర్బ్ ప్రదర్శనతో మ్యాచ్‌ 3 రోజుల్లోనే ముగిసింది. 312/2 ఓవర్‌ నైట్‌ స్కోరుతో మూడో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియా 421/5 భారీ స్కోరు వద్ద డిక్లేర్‌ చేసింది. ఈ క్రమంలో తొలి ఇన్నింగ్స్‌లో 271 పరుగుల భారీ ఆధిక్యాన్ని భారత జట్టు సాధించుకుంది. మొదట ఎన్నో అంచనాలతో బ్యాటింగ్‌కు దిగిన ఆతిథ్య విండీస్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 150 పరుగులకే ఆలౌటైంది.

DETAILS

అశ్విన్ ధాటికి 130 పరుగులకే కుప్పకూలిన విండీస్

రెండో ఇన్నింగ్స్‌లో కరేబియన్‌ టీమ్ అశ్విన్ (7/71) ధాటికి 130 పరుగులకే చాప చుట్టేసుకుంది. ఈ నేపథ్యంలోనే భారత్‌ ఇన్నింగ్స్‌, 141 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. అరంగేట్రంలోనే ఇండియన్ బ్యాట్స్ మెన్ యశస్వి జైస్వాల్ ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలవడం విశేషం. తొలి ఇన్నింగ్స్‌లో 5వికెట్లు పడగొట్టి విండీస్‌ను కోలుకోలేని దెబ్బతీసిన అశ్విన్, రెండో ఇన్నింగ్స్‌లో తన స్పిన్‌ మాయాజంతో మరింత రెచ్చిపోయాడు. మూడోరోజు టీబ్రేక్ సమయానికి 27/2తో నిలిచిన విండీస్,చివరి సెషన్‌లో ఏకంగా 8 వికెట్లు కోల్పోవడం గమనార్హం. మరోవైపు జులై 20న ట్రినిడాడ్ వేదికగా రెండో టెస్టు ప్రారంభం కానుంది.