LOADING...
Virat Kohli: టెస్టుల్లో విరాట్ కోహ్లీ సూపర్ రికార్డు
టెస్టుల్లో 8500 పరుగులు పూర్తి చేసిన విరాట్ కోహ్లీ

Virat Kohli: టెస్టుల్లో విరాట్ కోహ్లీ సూపర్ రికార్డు

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 14, 2023
11:43 am

ఈ వార్తాకథనం ఏంటి

డొమినికాలో వెస్టిండీస్ జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఓ అరుదైన రికార్డును సాధించాడు. ఆ మార్కును అధిగమించేందుకు 21 పరుగులు దూరంలో ఉన్న కోహ్లీ, తన మొదటి ఇన్నింగ్స్ లోనే ఆ మైలురాయిని చేరుకున్నాడు. మొదటి ఇన్నింగ్స్ లో విరాట్ కోహ్లీ 36 పరుగులు చేయడంతో టెస్టు క్రికెట్‌లో 8500 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా రికార్డుకెక్కాడు. దీంతో ఆ ఘనతను సాధించిన ఆరో భారత ప్లేయర్‌గా కింగ్ కోహ్లీ నిలిచాడు. కోహ్లీ కంటే ముందు సచిన్ టెండూల్కర్ (15,921), రాహుల్ ద్రవిడ్ (13,288), సునీల్ గవాస్కర్ (10,122), వీవీఎస్ లక్ష్మణ్ (8,781), వీరేంద్ర సెహ్వాగ్ (8,586) ఉన్నారు.

Details

టెస్టుల్లో కోహ్లీ సాధించిన రికార్డులివే

2011 వెస్టిండీస్ పర్యటనలో కోహ్లి టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. అతను మొదట్లో టెస్టుల్లో పెద్దగా రాణించకపోయినా, తర్వాత జట్టులో కీలక పాత్ర పోషించాడు. 2014లో టెస్ట్ కెప్టెన్ అయిన అత్యుత్తమ ప్రదర్శన చేశాడు. ఇప్పటివరకూ 110 టెస్టులాడిన కోహ్లీ 8515 పరుగులు చేశాడు. ఇందులో 28 సెంచరీలు, 28 హాఫ్ సెంచరీలు, 7 డబుల్ సెంచరీలున్నాయి. కెప్టెన్‌గా టెస్టుల్లో కోహ్లి ఏడు డబుల్ సెంచరీలు సాధించడం విశేషం. కోహ్లి స్వదేశంలో 60.05 సగటుతో 4,144 పరుగులు చేశాడు. ఇందులో 14 సెంచరీలు, 12 అర్ధ సెంచరీలున్నాయి.