
Ind vs Eng : ఇంగ్లండ్ దూకుడుకు తట్టుకోలేని టీమిండియా.. విదేశాల్లో మరో చెత్త రికార్డు!
ఈ వార్తాకథనం ఏంటి
మాంచెస్టర్ వేదికగా జరుగుతున్న అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ నాలుగో టెస్టులో ఇంగ్లండ్ జట్టు భారీ ఆధిక్యం దిశగా దూసుకెళుతోంది. మ్యాచ్ ప్రారంభంలో టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ తొలుత బౌలింగ్ ఎంచుకోగా, టీమిండియా మొదట బ్యాటింగ్‌కు దిగింది. భారత జట్టు మొదటి ఇన్నింగ్స్‌లో 358 పరుగులకు ఆలౌటైంది. దీంతో క్రీజులోకి దిగిన ఇంగ్లండ్ జట్టు దుమ్మురేపింది. ఓపెనర్ జాక్ క్రాలీ 84 పరుగులు చేయగా, బెన్ డకెట్ 4 పరుగులతో హాఫ్ సెంచరీ సాధించాడు. మూడో స్థానంలో వచ్చిన ఒలీ పోప్ 77 పరుగులతో మెరవగా, జో రూట్ అద్భుత సెంచరీతో 150 పరుగులు నమోదు చేశాడు. కెప్టెన్ బెన్ స్టోక్స్ 77 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.
Details
ఒత్తిడిలో టీమిండియా
మూడో రోజు ఆట ముగిసే సరికి ఇంగ్లాండ్ 7 వికెట్లు కోల్పోయి ఏకంగా 544 పరుగులు నమోదు చేసింది. ఈ స్కోరు భారత బౌలింగ్‌కు చెత్త గుర్తింపు తెచ్చిపెట్టింది. 2015లో సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా చేతిలో 572 పరుగులు ఇచ్చిన తర్వాత, విదేశీ టెస్టుల్లో భారత్ ఇదే మొదటిసారి 500+ పరుగులు ఇచ్చిన సందర్భమిది. అంటే దాదాపు దశాబ్దం తర్వాత భారత బౌలింగ్ ఈ స్థాయిలో విఫలమైందని చెప్పాలి. ఇంగ్లండ్ అద్భుత ప్రదర్శనతో మ్యాచ్‌పై తన పట్టు బలపరుచుకుంటూ, టీమిండియాను తీవ్ర ఒత్తిడిలోకి నెట్టింది.