Rohit Sharma:టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్స్‌కి టీమ్‌ఇండియా కచ్చితంగా వెళ్తుంది: రోహిత్ శర్మ
ఈ వార్తాకథనం ఏంటి
రోహిత్ శర్మ నేతృత్వంలో భారత క్రికెట్ జట్టు టీ20 వరల్డ్‌కప్ 2024లో ఘన విజయం సాధించింది. ఫైనల్లో దక్షిణాఫ్రికా జట్టును ఏడు పరుగుల తేడాతో ఓడించి, భారత్ విజేతగా నిలిచింది. 2007లో ఎంఎస్ ధోని నాయకత్వంలో భారత జట్టు తొలి టీ20 వరల్డ్‌కప్ ను గెలిచింది. ఆ జట్టులో రోహిత్ శర్మ కూడా కీలక సభ్యుడిగా ఉన్నాడు. తిరిగి 17 సంవత్సరాల తర్వాత 2024లో రోహిత్ శర్మ నేతృత్వంలో భారత జట్టు మళ్లీ టీ20 ప్రపంచకప్‌ను సొంతం చేసుకుంది. ఈ విజయం అనంతరం రోహిత్ తన టీ20 అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు చెప్పాడు.
వివరాలు
మెగా టోర్నీకి బ్రాండ్ అంబాసిడర్‌గా రోహిత్ శర్మ
తాజాగా, టీ20 వరల్డ్‌కప్ 2026కు సంబంధించిన షెడ్యూల్ మంగళవారం విడుదలైంది. ఈ కార్యక్రమంలో రోహిత్ శర్మ పాల్గొన్నారు. అలాగే అతడు ఈ మెగా టోర్నీకి బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా నియమితుడయ్యాడు. భారత టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
వివరాలు
ఫిబ్రవరి 15న కొలంబోలో భారత్,పాకిస్థాన్ మ్యాచ్
రోహిత్ శర్మ మాట్లాడుతూ, "2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ అహ్మదాబాద్‌లో జరిగింది.దేవుడి దయతో మేము ఆ ఫైనల్‌లో గెలిచి ట్రోఫీ సొంతం చేసుకున్నాం.దాదాపు ఎనిమిది నెలల తర్వాత మరో ICC ట్రోఫీ గెలిచాం. రాబోయే టీ20 వరల్డ్‌కప్ ఫైనల్స్‌లో టీమ్ ఇండియా ఖచ్చితంగా ఫైనల్‌లో ఉంటుంది. ఫైనల్‌లో భారత జట్టు ఏ టీమ్ మీద ఆడినా..చూడ్డానికి బాగుంటుంది.నేను ఖచ్చితంగా జట్టు ఫైనల్‌లో ఆడుతుందని ఆశిస్తున్నా. ఏం జరుగుతుందో చూద్దాం,"అని తెలిపారు. 2026 ICC టీ20 వరల్డ్‌కప్‌ను భారత్,శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం వహించనుంది. ఈ టోర్నీ ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు జరుగనుంది. భారత్,పాకిస్థాన్ ఒకే గ్రూప్‌లో ఉన్నాయి.ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ ఫిబ్రవరి 15న కొలంబోలో జరగనుంది.