Page Loader
IND Vs IRE : ఐర్లాండ్‌తో తొలి టీ20 సమరానికి సై అంటోన్న భారత్
రేపటి నుంచి ఐర్లాండ్ తో టీ20 సిరీస్ లో తలపడనున్న భారత్

IND Vs IRE : ఐర్లాండ్‌తో తొలి టీ20 సమరానికి సై అంటోన్న భారత్

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 17, 2023
02:48 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆసియా కప్, వన్డే వరల్డ్ కప్ 2023 వంటి మెగా టోర్నీకి ముందు ఐర్లాండ్‌తో భారత్ టీ20 సిరీస్ ఆడేందుకు సిద్ధమైంది. ఆగస్టు 18న ఇండియా, ఐర్లాండ్ మధ్య తొలి టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో భారత్ జట్టు ఫేవరేట్ గా ఉన్నప్పటికీ ఐర్లాండ్ జట్టును తక్కువ అంచనా వేయలేం. డబ్లిన్ వేదికగా మొదటి టీ20ల్లో ఇరు జట్లు తలపడనున్నాయి. ఈ మైదానంలో ఇప్పటివరకూ 21 టీ20 మ్యాచులు జరగ్గా, అందులో ఛేజింగ్ జట్లు 13 సార్లు గెలుపొందాయి. ఇండియా వర్సెస్ ఐర్లాండ్ టీ20 సిరీస్‌ని స్పోర్ట్స్ 18లో ఛానెల్‌లో చూడొచ్చు. అదే విధంగా జియో సినిమా యాప్‌లో ఈ మ్యాచులను ఉచితంగా చూడొచ్చు.

Details

ఇండియా, ఐర్లాండ్ జట్టులోని ఆటగాళ్లు వీరే

రెగ్యులర్ ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వడంతో టీమిండియా ద్వితీయ శ్రేణి ఆటగాళ్లతో బరిలోకి దిగుతోంది. రింకుసింగ్, జితేష్ శర్మ వంటి ఐపిఎల్ స్టార్‌లు ఈ సిరీస్‌లో టీమిండియా తరుఫున అరంగ్రేటం చేసే ఛాన్స్ ఉంది. ఐర్లాండ్ జట్టులో స్టిర్లింగ్, ఆండ్రూ బల్బిర్నీ, కర్టిస్ కాంఫెర్, మార్క్ వంటి ఆటగాళ్లు టీమిండియా గట్టి పోటినిచ్చే అవకాశం ఉంది. భారత్ జట్టు జైస్వాల్, గైక్వాడ్, తిలక్ వర్మ, శాంసన్ (WK), రింకుసింగ్, దూబే, వాషింగ్టన్ సుందర్, రవిబిష్ణోయ్, ముఖేష్ కుమార్, అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా (సి). ఐర్లాండ్ జట్టు ఆండ్రూ బల్బిర్నీ, పాల్‌స్టిర్లింగ్ (సి), లోర్కాన్‌టక్కర్ (WK), హ్యారీటెక్టర్, కర్టిస్‌కాంఫర్, జార్జ్ డాక్రెల్, డెలానీ, మార్క్ , బారీ మెక్‌కార్తీ, జాషువా లిటిల్, బెంజమిన్‌వైట్.