Team India: తొలి టెస్టులో టీమిండియా ఘన విజయం
బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. 524 పరుగుల లక్ష్యంతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లా జట్టు 234 పరుగులకే ఆలౌటైంది. దీంతో టీమిండియా జట్టు 280 పరుగుల తేడాతో గెలుపొందింది. భారత బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్ చేయడంలో బంగ్లా చివర్లో వరుసగా వికెట్లను కోల్పోయింది. బంగ్లా కెప్టెన్ శాంటో (82) ఒంటరి పోరాటం చేసినా ఫలితం లేకుండా పోయింది. భారత బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్(6) జడేజా(3) బుమ్రా ఒక వికెట్ తీశారు. ఇక రెండు టెస్టుల సిరీస్ లో భారత్ 1-0తో ఆధిక్యం సాధించింది. రెండో టెస్టు సెప్టెంబర్ 27న మొదలు కానుంది.