LOADING...
పొట్టి క్రికెట్లో తిలక్‌ వర్మ రికార్డు.. భారత రెండో ఆటగాడిగా గుర్తింపు
భారత రెండో ఆటగాడిగా గుర్తింపు

పొట్టి క్రికెట్లో తిలక్‌ వర్మ రికార్డు.. భారత రెండో ఆటగాడిగా గుర్తింపు

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Aug 14, 2023
02:26 pm

ఈ వార్తాకథనం ఏంటి

టీమిండియా యువ సంచలనం తిలక్‌ వర్మ, పొట్టి క్రికెట్ ఫార్మాట్ లో పరుగుల రికార్డు సృష్టించాడు. అంతర్జాతీయ టీ-20 మ్యాచుల్లో మొదటి ఐదు మ్యాచ్‌ల తర్వాత అత్యధిక పరుగులు చేసిన రెండో భారత క్రికెటర్ గా వర్మ ఘనత సాధించాడు. వెస్టిండీస్‌తో ఫ్లోరిడా వేదికగా జరిగిన ఐదో టీ-20 మ్యాచ్‌లో తిలక్‌ 27 పరుగులు చేశాడు. దీంతో ఐదు టీ20 మ్యాచ్‌ల్లో కలిపి 173 పరుగులు సాధించి అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఈ మేరకు మరో భారత ఆటగాడు దీపక్‌ హుడా (172) పరుగులను వర్మ అధిగమించడం విశేషం. ఈ జాబితాలో ఇప్పటికే స్టార్‌ ఆటగాడు కేఎల్‌ రాహుల్‌ (179) పరుగులతో అగ్రస్ధానంలో కొనసాగుతున్నాడు.

DETAILS

173 రన్స్ చేసిన వర్మ, రెండో భారత ఆటగాడిగా రికార్డు సృష్టించాడు

20 ఏళ్ల తిలక్ వర్మ, విండీస్‌ తో జరిగిన టీ-20 సిరీస్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి వచ్చాడు. కరేబియన్ గడ్డపై వర్మ మంచి ప్రదర్శనే కనబరిచి రికార్డులను లిఖించుకున్నాడు. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ ఆడిన వర్మ 173 పరుగులు నమోదు చేశాడు. మరోవైపు వెస్టిండీస్ చేతిలో కరేబియన్ గడ్డపై భారత్ 8 వికెట్ల తేడాతో ఘోర ఓటమిని చవిచూసింది.ఈ మేరకు ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 3-2తో విండీస్ వశమైంది. 2016 తర్వాత ఓ ద్వైపాక్షిక టీ-20 సిరీస్‌లో విండీస్‌ చేతిలో టీమిండియా ఓటమి పాలవడం ఇదే ఫస్ట్ టైమ్. తదుపరి భారత్‌ ఐర్లాండ్‌లో పర్యటించనుంది. అతిథ్య ఐరీష్‌తో 3 మ్యాచ్‌ల టీ-20 సిరీస్‌ ఆడనుంది. డబ్లిన్‌ వేదికగా ఆగస్ట్ 18న తొలి టీ-20 జరగనుంది.