IND vs NZ: స్వల్ప లక్ష్య ఛేదనలో భారత్ ఓటమి.. మూడో టెస్టూ కివీస్‌దే..
ఈ వార్తాకథనం ఏంటి
భారత జట్టు మూడో టెస్టులో కూడా దారుణంగా విఫలమైంది.147 పరుగుల లక్ష్యాన్ని చేధించేందుకు బరిలోకి దిగిన టీమిండియా 121 పరుగులకే ఆలౌటైంది.
ఈ విజయంతో న్యూజిలాండ్ 25 పరుగుల తేడాతో మ్యాచ్‌ను గెలిచింది.మూడు టెస్టుల సిరీస్‌లో భారత జట్టు వైట్‌వాష్ అవ్వడం ఇదే మొదటిసారి.
అజాజ్ పటేల్ (6/57),గ్లెన్ ఫిలిప్స్ (3/42),మాట్ హెన్రీ (1/10) చెలరేగడంతో భారత బ్యాటింగ్ కుప్పకూలింది.
అజాజ్ పటేల్ తొలి ఇన్నింగ్స్‌లోనూ ఐదు వికెట్లతో ఆకట్టుకున్నాడు.భారత బ్యాటర్లలో రిషభ్ పంత్ (64)మాత్రమే మెరుగైన ప్రదర్శన చేశాడు.
దీంతో మూడు టెస్టుల సిరీస్‌ను కివీస్ 3-0 తేడాతో గెలుచుకుంది.తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ 235 పరుగులు చేయగా,భారత్ 263 పరుగులకు ఆలౌటైంది.
అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో కివీస్ 174 పరుగులు చేసింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
25 పరుగుల తేడాతో గెలిచిన కివీస్
#TeamIndia came close to the target but it's New Zealand who win the Third Test by 25 runs.
— BCCI (@BCCI) November 3, 2024
Scorecard - https://t.co/KNIvTEyxU7#INDvNZ | @IDFCFIRSTBank pic.twitter.com/4BoVWm5HQP