
ENG vs IND: ఇంగ్లండ్‌తో టెస్టు మ్యాచ్.. అరుదైన రికార్డుకు చేరువలో బుమ్రా
ఈ వార్తాకథనం ఏంటి
ఇంగ్లండ్, భారత్ మధ్య జూలై 23న మాంచెస్టర్ వేదికగా నాలుగో టెస్టు ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్ టీమిండియా కోసం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఆమ్యాచులో భారత్ గెలిస్తే అవకాశాలు సజీవంగా ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో జస్పిత్ బుమ్రా మళ్లీ జట్టులోకి చేరే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. బుమ్రా ఈ టెస్టులో ఆడితే అరుదైన రికార్డును బద్దలు కొట్టే అవకాశం ఉంది. ముఖ్యంగా బుమ్రా ఐదు వికెట్లు తీస్తే ఇంగ్లండ్ గడ్డపై టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన ఆసియా బౌలర్‌గా చరిత్ర సృష్టిస్తాడు. ప్రస్తుత రికార్డు పాకిస్తాన్ మాజీ బౌలర్ వసీమ్ అక్రమ్ పేరిట ఉంది (14 మ్యాచ్‌ల్లో 53వికెట్లు). బుమ్రా ఇప్పటివరకు ఇంగ్లాండ్‌లో 11 టెస్టుల్లో 49 వికెట్లు తీసాడు.
Details
రెండు వికెట్లు తీస్తే ఐదో బౌలర్ గా ఘనత
మరో ఐదు వికెట్లు పడగొడితే, బుమ్రా SENA దేశాల్లో (దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) అత్యధికసార్లు ఐదు వికెట్లు తీసిన ఆసియా బౌలర్‌గా ఎదుగుతాడు. ప్రస్తుతం బుమ్రా, వసీమ్ అక్రమ్ ఇద్దరూ 11 సార్లు ఈ ఘనత సాధించారు. ఇంకా బుమ్రా ఈ మ్యాచ్‌లో మూడు వికెట్లు పడగొడితే, ఇషాంత్ శర్మ (51 వికెట్లు)ని అధిగమించి ఇంగ్లండ్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టిన భారత బౌలర్‌గా చరిత్ర సృష్టిస్తాడు. అంతేకాదు, కనీసం రెండు వికెట్లు తీసినట్టయితే, బుమ్రా ఇంగ్లండ్‌లో అన్ని ఫార్మాట్ల కలిపి 100 వికెట్లు పూర్తిచేసిన ఐదో భారత బౌలర్‌గా నిలుస్తాడు. ఇప్పటివరకు ఈఘనత రవిచంద్రన్ అశ్విన్ (150), రవీంద్ర జడేజా (122), అనిల్ కుంబ్లే (117), కపిల్ దేవ్ (113)లకే ఉంది.