LOADING...
ICC Test Rankings: టెస్ట్ ర్యాంకింగ్స్.. దూసుకొచ్చిన వాషింగ్టన్ సుందర్, జడేజా!
టెస్ట్ ర్యాంకింగ్స్.. దూసుకొచ్చిన వాషింగ్టన్ సుందర్, జడేజా!

ICC Test Rankings: టెస్ట్ ర్యాంకింగ్స్.. దూసుకొచ్చిన వాషింగ్టన్ సుందర్, జడేజా!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 30, 2025
03:32 pm

ఈ వార్తాకథనం ఏంటి

జూలై 30న భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగే ఐదో టెస్ట్‌కు ముందు తాజాగా ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది. ఈ ర్యాంకింగ్స్‌లో భారత ఆటగాళ్లు మెరుగైన స్థానం సాధించారు. మ్యాంచెస్టర్‌లో సెంచరీ బాదిన వాషింగ్టన్ సుందర్‌కి, అలాగే స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకు ర్యాంకుల్లో పురోగతి లభించింది. అయితే యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ మాత్రం మూడు స్థానాలు కోల్పోయాడు. ప్రస్తుతం భారత ఆటగాళ్లలో టెస్ట్ బ్యాటింగ్ విభాగంలో అత్యుత్తమంగా రిషబ్ పంత్ నిలిచాడు. వికెట్ కీపర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న పంత్ 776పాయింట్ల‌తో ఏడో స్థానంలో ఉన్నాడు. కెప్టెన్ శుభమన్ గిల్ తన స్థిరత్వాన్ని కొనసాగిస్తూ తొమ్మిదో స్థానంలో కొనసాగుతున్నాడు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ జో రూట్ 904 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

Details

మొదటి స్థానంలో జస్పిత్ బుమ్రా

ఇక గతంలో ఐదో స్థానంలో ఉన్న యశస్వి జైస్వాల్, తాజా అప్‌డేట్‌లో మూడు స్థానాలు పడిపోయి ఎనిమిదో స్థానానికి చేరుకున్నాడు. అతని ఖాతాలో ప్రస్తుతం 769 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. బౌలింగ్ విభాగంలో రవీంద్ర జడేజా ఒక స్థానం పైకి ఎగబాకి 14వ స్థానంలోకి చేరాడు. ఆయనకు 682 పాయింట్లు ఉన్నారు. మరోవైపు భారత స్పీడ్‌స్టర్ జస్పిత్ బుమ్రా 898 పాయింట్లతో మొదటి స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. ఆల్‌రౌండర్ ర్యాంకింగ్స్‌లో మ్యాంచెస్టర్ టెస్టులో తన తొలి ఇంటర్నేషనల్ సెంచరీ చేసిన వాషింగ్టన్ సుందర్ 8 స్థానాలు ఎగబాకి 14వ స్థానాన్ని అందుకున్నాడు. ప్రస్తుతం అతనికి 193 పాయింట్లు ఉన్నాయి. టెస్ట్ ఫార్మాట్‌లో ఆయన చూపించిన అద్భుత ప్రదర్శన పలువురి దృష్టిని ఆకర్షించింది.