Page Loader
MS Dhoni: 'తలా' బర్త్‌డే స్పెషల్.. ధోనీ పుట్టినరోజు వేడుకల్లో 7 షేడ్స్ హైలైట్!
'తలా' బర్త్‌డే స్పెషల్.. ధోనీ పుట్టినరోజు వేడుకల్లో 7 షేడ్స్ హైలైట్!

MS Dhoni: 'తలా' బర్త్‌డే స్పెషల్.. ధోనీ పుట్టినరోజు వేడుకల్లో 7 షేడ్స్ హైలైట్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 07, 2025
01:31 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత క్రికెట్‌కు చిరస్మరణీయ సేవలందించిన మాజీ సారథి ఎంఎస్ ధోని తన 44వ పుట్టినరోజును జూలై 7న సాదాసీదాగా జరుపుకున్నారు. ఇంటర్నేషనల్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పినప్పటికీ ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌కింగ్స్ తరపున ఇప్పటికీ అభిమానులను అలరిస్తున్న 'కెప్టెన్ కూల్' పుట్టినరోజు వేడుకల్లో సందడికి దూరంగా, స్నేహితుల మధ్యనే సరదాగా జరుపుకున్నారు. కేక్ కట్ చేసి, స్నేహితులకు తినిపిస్తూ చిన్నగా సెలబ్రేట్‌ చేసుకున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో ధోనీ స్లీవ్‌లెస్ బనియన్, షార్ట్‌తో కూల్‌గా కనిపించడంతో అభిమానులు ఫిదా అవుతున్నారు. ఎంఎస్ ధోనీకి 'ఏడు' నెంబర్‌తో ఒక ప్రత్యేక అనుబంధం ఉంది. జెర్సీ నెంబర్ 7, పుట్టిన రోజు కూడా జూలై 7నే కావడం గమనార్హం.

Details

సోషల్ మీడియాలో #HappyBirthdayDhoni హ్యాష్‌ట్యాగ్‌ ట్రెండ్

ఇందుకు కొనసాగింపుగా, స్టార్ స్పోర్ట్స్‌ ఓ స్పెషల్ వీడియోను విడుదల చేసింది. యువకుడిగా క్రికెట్‌ ప్రయాణం ప్రారంభించి,భారత జట్టుకు మూడు ఐసీసీ ట్రోఫీలు అందించిన కెప్టెన్‌గా ఎదిగిన తీరును ఇందులో చూపించింది. 'ధోనీ - 7 రూపాలు' అనే కాన్సెప్ట్‌ వీడియోలో ఆయన కెరీర్‌లోని ముఖ్య ఘట్టాలను చూపించి అభిమానులను భావోద్వేగానికి గురిచేసింది. భారత క్రికెట్ బోర్డు కూడా సోషల్ మీడియాలో ధోనీకి శుభాకాంక్షలు తెలుపుతూ..ఆయన విజయాలను గుర్తు చేసే ఫోటోను పోస్ట్ చేసింది. 2007 టీ20 వరల్డ్‌కప్, 2011 వన్డే వరల్డ్‌కప్, 2013 చాంపియన్స్ ట్రోఫీ వంటి ఐసీసీ గెలుపుల్లో కీలకంగా నిలిచిన మహీ పుట్టినరోజున టాక్‌ ఆఫ్ ది నేషన్‌గా మారిపోయాడు. సోషల్ మీడియాలో #HappyBirthdayDhoni హ్యాష్‌ట్యాగ్‌తో సందడి చేస్తోంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఫ్రెండ్ తో కలిసి కేక్ చేస్తున్న ధోని