Page Loader
 Taxpayer: ట్యాక్స్‌ చెల్లింపులో ఆ క్రికెటరే అగ్రస్థానం.. ఆయన ఎవరంటే?
ట్యాక్స్‌ చెల్లింపులో ఆ క్రికెటరే అగ్రస్థానం.. ఆయన ఎవరంటే?

 Taxpayer: ట్యాక్స్‌ చెల్లింపులో ఆ క్రికెటరే అగ్రస్థానం.. ఆయన ఎవరంటే?

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 25, 2024
01:35 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచవ్యాప్తంగా క్రికెట్‌కు ఉన్న క్రేజ్‌ మరో క్రీడకు ఉండదు. క్రికెటర్లను అభిమానులు దేవుళ్లలా పూజిస్తారు. వారి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ సినీ తారలను కంటే ఎక్కువగా ఉంటుంది. ఈ క్రికెటర్లు తమ ఆటతీరుతో పాటు, ఇతర మార్గాల ద్వారా కూడా మంచి సంపాదన కలిగిస్తుంటారు. ఆదాయాన్ని పొందినట్టుగానే ఆదాయపన్ను కూడా చెల్లిస్తుంటారు. ఇలా ఈ ఏడాది అత్యధికంగా ఆదాయపన్ను చెల్లించిన క్రికెటర్ మరెవరో కాదు విరాట్‌ కోహ్లీనే. ఈ ఏడాది ఆయన ఏకంగా రూ.66 కోట్లు ఆదాయపన్ను చెల్లించారు. రన్ మెషీన్‌గా పేరు గాంచిన విరాట్‌ కోహ్లీ గురించి తెలియని వారు ఉండరు. తన ఆటతీరు ద్వారా ప్రపంచవ్యాప్తంగా అభిమానులను ఆకర్షించిన కోహ్లీ, టీమిండియాలో టాప్ బ్యాటర్‌గా పేరుపొందాడు.

Details

యాడ్స్ ద్వారా వందల కోట్లు సంపాదన

అతను కేవలం క్రికెట్ ద్వారా మాత్రమే కాదు, యాడ్స్‌, ఇతర వ్యాపారాలు ద్వారా కూడా రూ.వందల కోట్లు సంపాదిస్తున్నాడు. అయితే ఈ సంపాదనకు తగ్గట్టు పన్నులు చెల్లించడంలో కూడా అతను ముందంజలో ఉన్నాడు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా పన్ను చెల్లించిన క్రికెటర్లలో విరాట్‌ కోహ్లీ మొదటి స్థానంలో నిలిచారు. కోహ్లీ ఏకంగా రూ.66 కోట్ల పన్ను చెల్లించారు. ఈ పన్ను చెల్లింపుల ఆధారంగా, ఆయన ఆదాయం ఈ ఏడాదిలో ఏకంగా రూ.200 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేయవచ్చు.

Details

రెండో స్థానంలో ధోని

కోహ్లీ తరువాత, మాజీ క్రికెటర్ ఎంఎస్‌ ధోనీ రూ.38 కోట్లతో రెండో స్థానంలో నిలిచారు. తర్వాతి స్థానాల్లో - సచిన్‌ టెండూల్కర్‌ రూ.28 కోట్లు, సౌరభ్‌ గంగూలీ - రూ.23 కోట్లు, హార్దిక్‌ పాండ్య - రూ.13 కోట్లు, రిషభ్‌ పంత్‌ - రూ.10 కోట్లు, అజింక్య రహానే - రూ.8 కోట్లు, బుమ్రా - రూ.7 కోట్లు, శిఖర్‌ ధావన్‌ రూ.6 కోట్లు, కేఎల్‌ రాహుల్‌ - రూ.5 కోట్లు నిలిచారు.