Page Loader
Ambati Rayadu : ప్రపంచ కప్ ఫైనల్‌లో భారత్ అందుకే ఓడిపోయింది : అంబటి రాయుడు
ప్రపంచ కప్ ఫైనల్‌లో భారత్ అందుకే ఓడిపోయింది : అంబటి రాయుడు

Ambati Rayadu : ప్రపంచ కప్ ఫైనల్‌లో భారత్ అందుకే ఓడిపోయింది : అంబటి రాయుడు

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 27, 2023
02:44 pm

ఈ వార్తాకథనం ఏంటి

వన్డే వరల్డ్ కప్ 2023 ఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓటమిని చవిచూసింది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఆటగాడు అంబటి రాయుడు (Ambati Rayadu) కీలక వ్యాఖ్యలు చేశాడు. పిచ్ నెమ్మదిగా ఉండటంతోనే భారత జట్టు ఓడిపోయిందని ఆయన అభిప్రాయపడ్డాడు. పిచ్‌ను బౌలింగ్, బ్యాటింగ్‌కు సమంగా సిద్ధం చేసి ఉంటే ఫలితం వేరేలా ఉండేదని పేర్కొన్నాడు. తాజాగా ఓ యూట్యూబ్ పోడ్‌కాస్ట్‌లో భారత్ ఓటమిపై రాయుడు స్పందించాడు. ముఖ్యంగా ఫైనల్‌లో పిచ్‌ను ప్రణాళిక ప్రకారమే ఇలా తయారు చేస్తే అది తెలివి తక్కువతనమే చెప్పుకొచ్చాడు.

Details

ఎలాంటి జట్టునైనా ఓడించే సత్తా టీమిండియాకు ఉంది

పరిమిత ఓవర్ల క్రికెట్‌లో పిచ్ మొదటి నుంచి ఆఖరి దాకా ఒకేలా ఉండటం మంచిదని, అప్పుడు టాస్ కూడా ప్రాధాన్యత ఉండదని అంబటి రాయుడు చెప్పాడు. ఎలాంటి జట్టునైనా ఓడించే నైపుణ్యం, సత్తా టీమిండియాకు ఉందన్నారు. వరల్డ్ కప్ ట్రోఫీని గెలవకపోయినా తాను చూసిన ప్రపంచ కప్ టోర్నీల్లో రోహిత్ సేననే అత్యుత్తమమైందని రాయుడు కొనియాడారు. ఇదిలా ఉండగా, ఐపీఎల్ 2023 టైటిల్ గెలిచిన అనంతరం అంతర్జాతీయ, దేశవాళీ, ఐపీఎల్‌కు రాయుడు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే.