Suryakumar Yadav : 'ఆ స్థానం నాకు ఫిక్స్..' సూర్యకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ఈ వార్తాకథనం ఏంటి
భారత టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తన క్రికెట్ కెరీర్ ప్రారంభంలో ఎదురైన ఒక ప్రత్యేక సంఘటనను ఇటీవల షేర్ చేశారు. ఐపీఎల్ ప్రాంచైజీ ముంబై ఇండియన్స్ డ్రెస్సింగ్ రూమ్‌లో మొదటి అడుగు వేస్తే ఎదురైన అనుభవం ఆయన జీవితంలో మరిచిపోయలేని జ్ఞాపకంగా మిగిలిందని చెప్పారు. సూర్య చెప్పిన ప్రకారం, మొదటిసారి డ్రెస్సింగ్ రూమ్‌లోకి అడుగుపెట్టినప్పుడు కూర్చోవడానికి ఏ స్థలం కనిపించలేదు. అప్పటికే క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూలర్ గణేశ్ విగ్రహం సమీపంలో కూర్చుని ఉన్నారు. సచిన్ సూర్యని చూసి "ఇక్కడ కుర్చీ పెట్టుకుని కూర్చోమా?" అని అడిగారు.
Details
సూర్య ఎల్లప్పుడూ అదే స్థలంలో కూర్చుంటారు
సూర్య "స్థలం లేదు" అని చెప్పినా, సచిన్ "సరే ఇక్కడికి రా" అని చెప్పి తన పక్కన కూర్చోబెట్టారు. ఆ రోజు కూర్చున్న స్థానం సూర్యకుమార్ యాదవ్ కోసం ప్రత్యేకమైపోయిందని, అది ఇప్పుడు కూడా ఆయనకు ఫిక్స్ అయిన స్థానం అని తెలిపారు. డొమెస్టిక్ మ్యాచ్ అయినా ఐపీఎల్ మ్యాచ్ అయినా, ఏ మ్యాచ్ అయినా, సూర్య ఎల్లప్పుడూ అదే స్థలంలో కూర్చుంటారని తెలిపారు. ఆయన ఆ ప్రయాణం అక్కడి నుంచే ప్రారంభమై, ముంబై ఇండియన్స్‌లో ఐపీఎల్‌లో దుమ్ము రేపుతూ, తర్వాత భారత జట్టులోకి చేరి కెప్టెన్సీ సారించి టీ20 వరల్డ్ కప్ విజయం సాధించాడని చెప్పారు. ప్రస్తుతం సూర్యకుమార్ యాదవ్ త్వరలో జరిగే ఐపీఎల్ 2026 కోసం సన్నద్ధమవుతున్నారు.