LOADING...
Rinku Singh: ఎంపీ ప్రియతో నా ప్రేమ అలా మొదలైంది : రింకూ సింగ్
ఎంపీ ప్రియతో నా ప్రేమ అలా మొదలైంది : రింకూ సింగ్

Rinku Singh: ఎంపీ ప్రియతో నా ప్రేమ అలా మొదలైంది : రింకూ సింగ్

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 23, 2025
04:38 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రజల కోసం గళమెత్తే యువ రాజకీయ నాయకురాలిగా ప్రియ సరోజ్ ప్రసిద్ధి చెందారు, మరోవైపు స్టేడియంలో సిక్సులు కొట్టే దూకుడైన క్రికెటర్ రింకూ సింగ్. విభిన్న నేపథ్యాలు ఉన్న వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించినట్టు రింకు సింగ్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. 2022లో కొవిడ్‌ సమయంలో ముంబయిలో జరిగిన ఐపీఎల్‌ మ్యాచ్‌ సమయంలో రొమాన్స్‌ మొదలైంది. ముంబై వచ్చినప్పుడు ఒక ఫ్యాన్‌ పేజీలో ప్రియ సరోజ్ ఫోటో చూసి ఆమెను ఇష్టపడినట్లు రింకు చెప్పారు. చూడగానే తనకు సరైన భాగస్వామిగాఅనిపించినప్పటికీ, ఆవిషయం వ్యక్తం చేయడానికి ధైర్యం తక్కువగా ఉన్నట్టయింది. కొన్ని రోజులకు ప్రియ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోలు లైక్‌ చేసినందుకు రింకు మెసేజ్‌ చేశాడు. అప్పటినుండి ప్రతిరోజు వారిద్దరు మాట్లాడుతూ సంబంధాన్ని పెంచుకున్నారు.

Details

ప్రేమ ఏ మాత్రం మారలేదు

కొంతకాలం తర్వాత, కలిసి జీవితాన్ని పంచుకోవాలనే నిర్ణయానికి వచ్చారు. ప్రియ ఎంపీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కూడా, వారి ప్రేమ ఏమాత్రం మారలేదని అని రింకు తెలిపారు. ఆమె ఎల్లప్పుడూ ప్రజల మధ్య ఉండటం, సమస్యలను తెలుసుకోవడం, పార్లమెంట్‌ సమావేశాల్లో పాల్గొనడం, రింకు మ్యాచ్‌లలో బిజీగా ఉండడం వల్ల ఎక్కువ సమయం కలిసి గడపలేకపోయారు. అందువల్ల, రాత్రి వేళల్లోనే కొంత సమయం కేటాయించి, వ్యక్తిగత, వృత్తి సంబంధ విషయాలు మాట్లాడుకుంటూ, అవసరమైన సలహాలు ఇచ్చుకుంటున్నారని వివరించారు.

Details

బిజీ షెడ్యూల్ వల్ల షారుఖ్ ఖాన్ రాలేదు

తాజాగా జరిగిన నిశ్చితార్థానికి బాలీవుడ్‌ నటుడు, కోల్‌కతా నైట్ రైడర్స్ యజమాని షారుఖ్‌ ఖాన్‌ను ఆహ్వానించినప్పటికీ, బిజీ షెడ్యూల్‌ కారణంగా ఆయన రాలేదని రింకు పేర్కొన్నారు. అంతేకాక, రింకు తన క్రికెట్‌ కెరీర్‌పై కూడా మధురమైన అభిప్రాయం వ్యక్తం చేశారు. \ 'గతేడాది ప్రదర్శన పెద్దగా గొప్పగా లేకపోయినా, ఆసియా కప్‌ స్క్వాడ్‌లో ఉంటానని అనుకోలేదు. సెలక్టర్లు నాపై నమ్మకం ఉంచడం నా ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. ఇప్పుడు యూపీ టీ20 లీగ్‌లో నిబ్బరంగా ఆడగలుగుతున్నానని రింకు సింగ్ చెప్పారు.