షాకింగ్ న్యూస్.. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ ఆటగాడు
ఈ వార్తాకథనం ఏంటి
వెస్టిండీస్(West Indies) క్రికెట్ బోర్డుకు ఆ జట్టు సీనియర్ బ్యాటర్ డారెన్ బ్రావో(Darren Bravo) షాకిచ్చాడు.
అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడం ద్వారా అభిమానులకు తెలియజేశాడు.
ఇంగ్లండ్‌తో జరగనున్న టీ20 సిరీస్‌కు తనను ఎంపిక చేయకపోవడంతో తీవ్ర ఆవేదనకు గురైన బ్రావో.. రిటైర్మెంట్ ప్రకటించాడు.
టీ20, వన్డే, టెస్టుల నుంచి తాను వైదొలుగుతున్నట్లు డారెన్ చెప్పాడు. తన రిటైర్‌మెంట్‌కు ఇదే సరైన సమయం అని భావిస్తున్న బ్రావో పోస్ట్‌లో రాసుకొచ్చాడు.
తన రిటైర్మెంట్ ద్వారా వర్ధమాన ఆటాగాళ్లకు అవకాశం లభిస్తుందని తాను భావిస్తున్నట్లు అభిప్రాయపడ్డాడు.
టీ20
డారెన్ బ్రావో కెరీర్ గణాంకాలు ఇవే..
డారెన్ బ్రావో వెస్టిండీస్ తరఫున టీ20, వన్డే, టెస్టులు ఆడాడు. టెస్టు క్రికెట్‌లో అతనికి ఎక్కువ పరుగులు ఉన్నాయి.
అతను 56మ్యాచ్‌లలో 102ఇన్నింగ్స్‌లలో 36.1సగటు, 44.86స్ట్రైక్ రేట్‌తో 3538పరుగులు చేశాడు.
ఈ ఫార్మాట్‌లో అతని అత్యధిక స్కోరు 218పరుగులు. టెస్టు క్రికెట్‌లో 8సెంచరీలు, 1డబుల్ సెంచరీ, 17హాఫ్ సెంచరీలు సాధించాడు.
టీ20 ఫార్మాట్‌లో అతి తక్కువ మ్యాచ్‌లు ఆడాడు. 26 మ్యాచ్‌లలో 21.32 సగటు, 106.86 స్ట్రైక్ రేట్‌తో 405 పరుగులు చేశాడు.
ఈ ఫార్మాట్‌లో ఒక్క సెంచరీ, హాఫ్ సెంచరీ కూడా లేదు. వన్డేల్లో 122 మ్యాచ్‌లలో 117 ఇన్నింగ్స్‌లలో 29.61 సగటు, 70.12 సగటుతో 3109 పరుగులు చేయగలిగాడు. ఈ ఫార్మాట్‌లో 4 సెంచరీలు, 18 అర్ధ సెంచరీలు చేశాడు.